PM Modi: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ ఉత్తర్ ప్రదేశ్‌లో ప్రచారం నిర్వహించారు. మరోసారి ప్రతిపక్ష ఇండియా కూటమిని, వంశపారంపర్య రాజకీయాలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.
Madhyapradesh : లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు నిరంతరం పార్టీని వీడుతున్నారు.
ఈనెల 9వ తేదీ లోపు రైతు భరోసా డబ్బులు పూర్తిగా అకౌంట్స్ లో పడుతుంది అని ఆయన పేర్కొన్నారు. ఇక, రైతు రుణమాఫీపై మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. ఇప్పటికే 5 గ్యారంటీలను అమలు చేశాం.. కేసీఆర్ ఆరు గ్యారంటీలు అమలు కాలేదు అంటున్నాడు అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
పార్లమెంట్‌లో ప్రజల గొంతుకగా నిలిచేందుకే తనకు మద్దతు తెలపాలని.. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి తీగుల్ల పద్మారావు గౌడ్ ఓటర్లకు పిలుపునిచ్చారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఇతర నేతలతో కలిసి రాంగోపాల్ పేట్, నల్లగుట్ట, కాచిబౌలి, గైదన్ భాగ్ బస్తీలలో పద్మారావు గౌడ్ విస్తృతంగా పర్యటించారు.
మోడీ పని రాక్షసుడు.. ఆయన నిద్రపోరు.. మమ్మల్ని నిద్రపోనివ్వరు అంటూ ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. మోడీ లాంటి వ్యక్తి దేశానికి అవసరమైన నాయకుడు.. సెలవు ఉంది కదా అని ఓటెయ్యకుండా ఉండకండి.. ఓటేసి సెలవు తీసుకోండి అని కిషన్ రెడ్డి వెల్లడించారు.
బీజేపీ ప్రభుత్వం ఎప్పటికీ రాజ్యాంగాన్ని మార్చదు లేదా రిజర్వేషన్లను అంతం చేయదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు.