ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్ లో గాంధీనగర్ నియోజకవర్గాన్ని బీజేపీ కంచుకోటగా పరిగణిస్తారు. 34 నాలుగేళ్లుగా ఆ నియోజకవర్గంలో బీజేపీ పాగా వేసింది. అటల్ బిభారీ వాజ్ పేయి, అధ్వాణి వంటి బీజేపీ కీలక నేతలు ఈ నియోజకవర్గం నుంచే గెలుపొందారు.
నేడు లోక్ సభ మూడో దశ ఓటింగ్ జరుగుతోంది. 12 రాష్ట్రాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. అందులో ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్, గోవాలు సైతం ఉన్నాయి. కాగా.. ఈ దశ ఓటింగ్ ఆప్-కాంగ్రెస్ కూటమికి అగ్ని పరీక్ష కానుంది.
లోక్‌సభ ఎన్నికల మూడో విడతలో రికార్డు స్థాయిలో ఓటు వేయాలని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రజలను కోరారు. "నేటి దశలో ఓటు వేసే వారందరినీ రికార్డు సంఖ్యలో ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. వారి చురుకైన భాగస్వామ్యం ఖచ్చితంగా ఎన్నికలను మరింత చైతన్యవంతం చేస్తుంది" అని ప్రధాని మోడీ ఎక్స్(గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఉదయం అహ్మదాబాద్‌లోని ఓ పాఠశాలలో ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్న సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి కంగనాను బీజేపీ పోటీకి దింపింది. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కంగనా రనౌత్ సినీ పరిశ్రమను విడిచిపెట్టేది లేదని చెప్పారు.
లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ నేడు జరగనుంది. ఈ దశలో, 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 93 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల భవితవ్యాన్ని ప్రజలు నమోదు చేయనున్నారు. ఈ దశలో 1351 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండగా.. వారిలో 120 మంది మహిళలు ఉన్నారు.
వచ్చే నెల 13న జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం హైదరాబాద్ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. పోలింగ్ సందర్భంగా నగరంలో కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్)తో సహా మొత్తం 14 వేల మంది సిబ్బందిని మోహరిస్తున్నట్లు తెలిపారు. భారత ఎన్నికల సంఘం (EC) మార్గదర్శకాల ప్రకారం, CAPF సిబ్బందిని నగరంలోని పోలింగ్ కేంద్రాల వద్ద మోహరిస్తారు. ” EC హైదరాబాద్‌కు 22…
Akali Dal: శిరోమణి అకాలీదళ్ పార్టీకి షాక్ తగిలింది. అత్యంత కీలమైన చండీగఢ్ ఎంపీ స్థానం నుంచి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్న హర్దీప్ సింగ్ పార్టీకి రాజీనామా చేశారు.
BJP: ఇండియా కూటమి నేతలు పాకిస్తాన్ స్వరాన్ని వినిపిస్తున్నాయని బీజేపీ దుయ్యబట్టింది. అలాంటి ద్రోహుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సోమవారం బీజేపీ కోరింది.
Lok Sabha Elections 2024: కర్ణాటకలో బీజేపీ రూపొందించిన యానిమేటెడ్ వీడియో ఒకటిపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారనే ఆరోపణపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో పాటు కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర, ఆ పార్టీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వీయాపై కేసు నమోదైంది.