కాంగ్రెస్ లో ముఖ్యమంత్రిగా ఉండి భారతీయ జనతా పార్టీలోకి చేరాల్సిన అవసరం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు టీఆర్ఎస్ అసత్య ప్రసారం చేస్తుంది.. ఎన్నికల్లో ఓట్లు సాధించడం కోసమే ఈ దుష్ప్రచారం అని మంత్రి శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు.
దేశంలో మత ప్రతిపాదకన హిందూ -ముస్లింల మధ్య ప్రధాని మోడీ చిచ్చు పెడుతున్నారని పేర్కొన్నారు. స్వతహాగా రాజకీయంలో ఎదిగిన వ్యక్తిని నేను.. దేశ సమగ్రత కొరకు కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ.. బలహీన వర్గాల రిజర్వేషన్లు తీసి వేసి రాజ్యాంగని మార్చే కుట్ర చేస్తున్నారని జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
గుంటూరు గొంతు ఎండకుండా చూడాల్సిన బాధ్యత మాపై ఉందని.. ఏడాదిలోపు నిధులు సేకరించి పనులు ప్రారంభిస్తామని.. గుంటూరు ప్రజలకు నీళ్లు అందిస్తామని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. గుంటూరు నగరంలో భాగమైన గోరంట్లలో కొన్నేళ్లుగా ఆగిపోయిన రిజర్వాయర్ నిర్మాణాలను తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థులైన నసీర్ అహ్మద్, పిడుగురాళ్ల మాధవి, బూర్ల రామాంజనేయులుతో కలిసి పెమ్మసాని శనివారం పరిశీలించారు.
కరీంనగర్ లోని అంబేడ్కర్ స్టేడియంలో వాకర్స్ ను కలిసి బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఎలక్షన్ ప్రసారం నిర్వహించారు. వాకర్స్ క్రీడాకారులను కలిసి తమకు ఓటు వేయాలంటూ క్రికెట్, వాలీబాల్ ఆడారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జగిత్యాల పట్టణంలో నేడు (ఆదివారం) పర్యటించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డికి మద్దతుగా పట్టణంలో నిర్వహించే రోడ్డు షోలో పాల్గొననున్నారు.
లోక్‌సభ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. రాజకీయ పార్టీలు పూర్తి సన్నద్ధతతో ఓటర్లను తమవైపు తిప్పుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రామనగరికి రానున్నారు.