ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ప్రచారంలో వేగాన్ని పెంచారు. మరో వైపు తల్లి గెలుపును కాంక్షిస్తూ ఆమె కూతురు మనీషా రెడ్డి జోరుగా ప్రచారం చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ భారతీయ జనతా పార్టీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమక్షంలో చేవెళ్ల మండలం ముడిమ్యాల గ్రామానికి చెందిన సుమారు వంద మంది కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ.. “గడిచిన పదేళ్లలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ కు బీజేపీ ప్రభుత్వం ఏం ఇచ్చింది.. గాడిద గుడ్డు తప్ప. కులాల మధ్య, ప్రాంతాల మధ్య లింక్ పెడుతూ ద్వేషాన్ని రెచ్చగొట్టింది బీజేపీ. ఈ సారి అధికారం లోకి వస్తె భారత రాజ్యాంగంను మారుస్తామని ప్రధాని మోడీ అనేక వేదికల్లో…
సార్వత్రిక ఎన్నికల వేళ మాజీ గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను తెలంగాణ గవర్నర్ గా ఉన్నప్పుడు తనకు తెలంగాణ ప్రజల మధ్య బీఆర్ఎస్ నేతలు గ్యాప్ క్రియేట్ చేశారని ఆరోపించారు.
ఆరులో ఐదు గ్యారెంటీలు పూర్తి చేశామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ధనిక రాష్ట్రం తెలంగాణాను Brs ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చి కాంగ్రెస్ వచ్చాక చిప్ప చేతికి ఇచ్చిందని ఆరోపించారు.
Amit Shah: వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ, నిన్న రాయ్‌బరేలీ స్థానానికి కూడా నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ స్థానం నుంచి సోనియాగాంధీ పోటీ నుంచి తప్పుకోవడంతో రాహుల్ గాంధీని కాంగ్రెస్ బరిలోకి దింపింది.
Arvinder Singh Lovely: లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కి భారీ ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇటీవల ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్న అరవిందర్ సింగ్ లవ్లీ ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన మీట్ ద ప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ.."బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ మరోసారి కాంగ్రెస్ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన జేఎంఎం-కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.