పదేళ్ల నిజం కేసీఆర్ పాలన, పదేళ్ల విషం బీజెపీ పాలన.. 150 రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి పాలన అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం వీటి మధ్యనే పోటీ జరుగుతుందని స్పష్టం చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ..”నరేంద్రమోడీ వస్తె కాలేజులు కట్టిన, రోడ్లు వేసిన అని చెప్పాలే. ఇంటింటికీ 15లక్షలు ఇస్తా అని నల్ల ధనం తిరిగి తెస్తా అని మాట తప్పిండు. ధరలను తగ్గిస్తా అని అన్నాడు జరగలేదు. రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు జరగలేదు. బుల్లెట్ రైలు తెస్తా భారత దేశానికి అన్నాడు జరగలేదు. 10 ఎండ్లలో 20 కోట్ల ఉద్యోగాలిస్తా అన్నాడు. పడేండ్లలో ఎం చేసినవ్ నీకు ఎందుకు ఓటు వేయాలి అంటే మోడీకి చెప్పడానికి సమాధానం లేదు. మేం గుడి కట్టినం మాకు ఓటేయండి అంటారు. మరి నాలుగేండ్ల కిందనే యాదగిరి గుట్టలో అద్భుతమైన గుడి కట్టిన కేసీఆర్. కాళేశ్వరం వంటి ప్రాజెక్టు కట్టి నెర్రెలు పారిన నేలలకు నీళ్ళు తెచ్చింది కేసీఆర్. మన రైతులకు రైతు బంధు ఇచ్చిండు ఎవరూ రైతులు చావకుండా చూసుకున్నాడు. 24 గంటల కరెంటు ఇచ్చింది కేసీఆర్. రేవంత్ రెడ్డి రైతులకు 500 వందల రూపాయలు బోనస్ ఇస్తా అన్నాడు.” అని ఆయన వ్యాఖ్యానించారు.
READ MORE: CM Revanth Reddy: తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి వీడియో సందేశం..
రైతులకు రుణ మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి అన్నాడు చేయలేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. “ఆడపడుచుకు తులం బంగారం ఇస్తా అన్నాడు ఇవ్వలేదు. ఆడ పిల్లలకు స్కూటీ ఇస్తా అన్నాడు రాలేదు. కాంగ్రెస్ వాళ్ళ లూటీ చాల అయింది.. హైదరాబాదును యూటీ చేస్తా అంటున్నారు. పార్లమెంట్ లో కొట్లాడాలంటే బీ ఆర్ ఎస్ ఎంపీలు ఉండాలే. మతం పేరు మీద, దేవుని పేరు మీద మ్యాజిక్ లు చేస్తే ఆగం కాకండి. 400 వందల సిలెండర్ 1200 అయింది.. అన్ని పిరం అయినాయి. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది మోడీ ప్రభుత్వం. 2వ నెంబరు మీద కొప్పుల ఈశ్వర్ అన్న కారు గుర్తుకు ఓటు వేయండి. 6 నెలల్లో మళ్ళీ రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాల్ని శాసించే పరిస్థితి వస్తది.17 రోజుల బస్సు యాత్ర తర్వాత నాకు జనం నుంచి సమాచారం వచ్చింది. పాత ప్రభుత్వం చేసిన పనులను సమీక్షలు చేయాలి. కానీ ఇక్కడ భిన్నంగా జరిగింది. రాహుల్ గాంధీ వస్తేనే సరూర్ నగర్ సభ కు ఎవరూ రాలేదు. ఇదే వారి ఓటమికి సంకేతం. కొత్తగా ఏర్పడిన ఏ ప్రభుత్వం అయినా రాష్ట్రం సుభిక్షంగా ఉంది. కానీ కాంగ్రెస్ రాగానే ఇది దివాళా తీసింది.” అని తెలిపారు.