Amit Shah: కాశ్మీర్‌లో శాంతి నెలకొంటే, పీఓకే ఆజాదీ నినాదాలతో దద్ధరిల్లుతోంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) రగులుతోంది. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు తిరగబడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం హోం మంత్రి అమిత్ షా బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పీఓకే మద్దతు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. పీఓకే భారత్‌లో అంతర్భాగమని, దానిని మేం తీసుకుంటామని అన్నారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత, ఒకప్పుడు సమస్యాత్మక ప్రాంతంగా ఉండే జమ్మూ కాశ్మీర్‌లో శాంతి నెలకొంటే, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో మాత్రం ఇప్పుడు ఆజాదీ నినాదాలు, నిరసనలు ప్రతిధ్వనిస్తోందని పశ్చిమ బెంగాల్ సేరంపూర్‌లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి షా అన్నారు. ఇప్పుడు పీఓకేలో ప్రజలు రాళ్లు రువ్వతున్నారని చెప్పారు.
Read Also: AP Elections 2024: ఫైనల్లీ ఏపీ పోలింగ్ శాతం చెప్పేశారు.. 2019 కంటే ఎంత పెరిగిందంటే?
Also Read
- Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
- Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Rahul Gandhi: ఇండీ కూటమి నేతలకు రాహుల్ గాంధీ ‘‘టీ’’ పార్టీ..
- Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..
ఇటీవల పీఓకేపై కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా మాట్లాడుతూ.. ‘‘మణిశంకర్ అయ్యర్ వంటి కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్ వద్ద అణుబాంబులు ఉన్నందును పీఓకేని తీసుకోవద్దని చెప్పారు. అయితే, నేను పీఓకే భారత్‌లో భాగమే అని చెబుతున్నాను, దానిని భారత్ తిరిగి తీసుకుంటుంది’’ అని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు అవినీతి నాయకులు ఉన్న ఇండియా కూటమికి, నిజాయితీ కలిగిన నరేంద్రమోడీకి మధ్య జరుగుతున్నాయని, ఆయన ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా ఉన్న ఒక్క పైసా ఆరోపణ కూడా రాలేదని అమిత్ షా అన్నారు.
చొరబాటుదారులు కావాలా..? లేక శరణార్ధులకు సీఏఏ కావాలా అనే దాన్ని బెంగాల్ నిర్ణయించుకోవాలని అన్నారు. జీహాద్‌కి ఓటేయాలా..? లేక వికాస్‌కి ఓటేయాలా..? అనే విషయాన్ని బెంగాల్ ప్రజలు నిర్ణయించుకోవాలని సూచించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సీఏఏని వ్యతిరేకించి తన ఓటు బ్యాంకుని ప్రసన్నం చేసుకోవాలని, చొరబాటుదారులకు మద్దతుగా ర్యాలీ చేపట్టిందని అమిత్ షా నిందించారు.
తాజావార్తలు
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!