సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే సందేశ్‌ఖాలీ ఘటనతో మమతా బెనర్జీ ప్రభుత్వం తీవ్ర విమర్శలు పాలైంది.
డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు.
Rahul Gandhi Gave update on Amethi Seat: లోక్‌సభ ఎన్నికలు 2024లో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేదెవరనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కంచుకోటగా ఉన్న అమేథీ స్థానం నుంచి బీజేపీ తరఫున కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మళ్లీ పోటీ చేస్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా.. కాంగ్రెస్ మాత్రం తమ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. అయితే అమేథీ స్థానంపై రాహుల్ గాంధీ…
Rahul Gandhi : రాబోయే ఎన్నికల్లో బీజేపీ బలం కేవలం 150సీట్లకు తగ్గుతుందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఎస్పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ బుధవారం ఘజియాబాద్‌లో మీడియా సమావేశంలో అన్నారు.
ప్రతిపక్ష పార్టీలు ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతున్నాయని ప్రధాని మోడీ అన్నారు. ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా బీహార్‌లోని పూర్ణయాలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోడీ మాట్లాడారు.
దేశ ప్రజలకు ఒక్కటే గ్యారంటీ.. అది మోడీ గ్యారంటీ తప్ప వేరే ఏ గ్యారంటీ లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్పారు. నిజామాబాద్ జిల్లా భీంగల్‌లోని బ్రహ్మ లింగేశ్వర టీ పాయింట్ దగ్గర చాయ్ పే చర్చలో ధర్మపురి అరవింద్ పాల్గొని మాట్లాడారు.
రేవంత్ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేటట్టు లేదు అని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ భయంతో నారాయణాపేట సభలో భయంతో మాట్లాడుతున్నారు.. ఎప్పుడు ఆయన బీజేపీతో కలుస్తాడో తెలియదు అని పేర్కొన్నారు.
బీజేపీ దొందు దొందే అని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి డిసెంబర్ 9వ తేదీ నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు.. ఎవరికైనా అయ్యిందా..? అని ప్రశ్నించారు. రుణమాఫీ అయ్యినోళ్లు కాంగ్రెస్ కే ఓటేయండి.. కానోళ్లు మాత్రం బీఆర్ఎస్ కే ఓటేయండి అన్నారు.
కాంగ్రెస్ ఎక్కడుంటే మత కల్లోలాలు, కర్ఫ్యూలు, కరప్షన్ ఉంటుంది అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. స్వాత్యంత్రం వచ్చాక ఒక బీసీ నాయకుడు ప్రధాని అయ్యాడు.. దేశంలో అద్భుతమైన రహదారులు వేశాం.