రఘునందన్ రావు మాట్లాడుతూ.. దేశంలో 400 సీట్లు గెలుస్తాం...అందులో మెదక్ సీటు కూడా ఉందన్నారు. రేపు నామినేషన్ లు వేసే వ్యక్తి కులాన్ని నమ్ముకొని వస్తున్నారు..
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌పై ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం తొలిసారి స్పందించారు. కవిత అరెస్ట్ ముమ్మాటికి అక్రమమేనన్నారు. లిక్కర్ స్కామ్ పాలసీ కుంభకోణంలో ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారని విమర్శలు గుప్పించారు.
సార్వత్రిక ఎన్నికల వేళ బాలీవుడ్ నటులకు సంబంధించిన వీడియోలు నెట్టింట తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రముఖ నటులు ఆయా పార్టీలకు ప్రచారం చేస్తున్నట్లు డీప్‌ఫేక్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశామని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఎంపీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.. నామినేషన్లు ఆన్లైన్ లో కూడా సమర్పించవచ్చు.. నామినేషన్ పత్రాలు ప్రింట్ తీసి 24 ఏప్రిల్ వరకు ఆర్వోకు అందజేయాలన్నారు.
ఇండియా కూటమిలో ఆన్న మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్ 400 స్థానాల్లో పోటీ చేసినా కూడా గెలిచే అవకాశం లేదని చెబుతుంది.. మరి ఏ రకంగా రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి.. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేదు లేదు: ఎంపీ లక్ష్మణ్
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. అన్ని పార్టీలు హేమాహేమీలైన అభ్యర్థులను బరిలోకి దింపాయి. అయితే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో శ్రీకళారెడ్డి అనే మహిళ పోటీ చేస్తోంది.
104 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే భారతీయ జనతా పార్టీ వాళ్ళు మన ప్రభుత్వానికి కూల్చడానికి కుట్రలు చేశారు.. అలాంటిది 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కాంగ్రెస్ సర్కార్ ను బీజేపీ వాళ్లు బతకానిస్తారా అని కేసీఆర్ ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి రుణమాఫీకి ఆగస్టు 15 అంటూ జనాలను ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారు అని భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలం అయింది..ప్రభుత్వం ఉంటదో ఉడుతుందో అనే కాంగ్రెస్ వాళ్లకు భయం పట్టుకుంది..
దేశ వ్యాప్తంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అవుతున్న వేళ దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలని, దీనిలో ఎలాంటి అనుమానాలకు తావివ్వొద్దని సుప్రీంకోర్టు తెలిపింది.