వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్ని ఇప్పటికే బీఆర్ఎస్ ప్రకటించింది. ఇక నాల్గో విడత జరిగే ఎన్నికలకు ఈనెల 19న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.
హేటిరో సంస్థకు ఇచ్చిన భూమి పై ఇప్పటి వరకు ప్రభుత్వం చర్యలు లేవు అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిని ఆమోదిస్తున్నట్లు అర్థమవుతుంది.. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కట్టబెట్టడం బాధాకరమన్నారు.
హన్మకొండ జిల్లాలోని మడికొండ సత్యం గార్డెన్స్ లో జరిగిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే రాజయ్య విరుచుకపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ లను దారుణంగా మోసం చేసిన వ్యక్తి కడియం శ్రీహరి అని తెలిపారు.
హనుమకొండ జిల్లా ధర్మసాగర్, వేలేరు మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని.. వందల కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి వల్ల రాజేశ్వర్ రెడ్డి అని ఆరోపించారు.
Sunitha Kejriwal : దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా, గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున సునీతా కేజ్రీవాల్ ప్రచారం చేయవచ్చని ఆమ్ ఆద్మీ పార్టీ నుండి తెలుస్తోంది.
BSP Candidate List: లోక్‌సభ ఎన్నికలకు బహుజన్ సమాజ్ పార్టీ మరో 11 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మెయిన్‌పురి స్థానం నుంచి బీఎస్పీ తన అభ్యర్థిని మార్చింది. జౌన్‌పూర్ నుంచి బాహుబలి ధనంజయ్ సింగ్ భార్య శ్రీకళా సింగ్‌కు టికెట్ ఇచ్చారు.
PM Modi: సిక్కు, హిందువుల దేవతలు, ప్రార్థనా స్థలాల పేరుతో ఓట్లు వేయించుకున్న ప్రధాని నరేంద్ర మోడీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను న్యాయవాది ఆనంద్ ఎస్ జోంధాలే దాఖలు చేశారు.
దేశ భవిష్యత్ కోసం మోడీని మరోసారి గెలిపించాలని ప్రజలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్‌లో కిషన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోతో దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రమాదమని ప్రధాని మోడీ తెలిపారు. ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ మాట్లాడారు. కాంగ్రెస్ చేసిన హామీలతో ప్రజలకు ఒరిగేదేమీలేదని తెలిపారు.
మణిపూర్‌లో శాంతిని నెలకొల్పడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంఫాల్‌లో అమిత్ షా ఎన్నికల ర్యాలీ నిర్వహించారు.