తెలంగాణకు మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, నవోదయ స్కూళ్లు ఇవ్వకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొండి చేయి చూపింది అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.
Asaduddin Owaisi: తెలంగాణ రాష్ట్రంలో పొత్తులపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ఏ పార్టీతోనూ పొత్తు లేదని హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు.
వచ్చే వారమే తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. కానీ ఇప్పటి వరకూ మూడు స్థానాలకు మాత్రం అభ్యర్థుల్ని ఇంకా ఖరారు చేయలేదు. దీనిపై గత కొంతకాలంగా తీవ్ర కసరత్తు చేస్తోంది. శనివారం సాయంత్రం దీనిపై కాంగ్రెస్ సీఈసీ ఒక క్లారిటీ ఇవ్వనుంది.
బీజేపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారైంది. సార్వత్రిక ఎన్నికల వేళ మేనిఫెస్టో తయారీకి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆధ్వర్యంలో బీజేపీ అధిష్టానం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ దేశ వ్యాప్తంగా ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది.
దేశ వ్యాప్తంగా జోరుగా సార్వత్రిక ఎన్నికల ప్రచారం సాగుతోంది. ఇక బీజేపీ నుంచి బాలీవుడ్ హీరోయిన్లు అభ్యర్థులుగా బరిలోకి దిగారు. దీంతో ప్రచారంలో తమదైన శైలిలో దూసుకుపోతున్నారు.
సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు వరుస దెబ్బలు తగలుతున్నాయి. ఆ పార్టీని ముఖ్య నేతలు వీడుతున్నారు. గురువారం ఢిల్లీలో గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ మాజీ నేత రోహన్ గుప్తా భారతీయ జనతా పార్టీలో చేరారు.
సార్వత్రిక ఎన్నికల వేళ చైనాతో సంబంధాలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాతో స్థిరమైన, శాంతియుత సంబంధాలు భారత్‌కే కాదు.. ప్రపంచానికీ కీలకమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.
2025 నాటికి ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అగ్నిపథ్ స్కీమ్‌ను కూడా రద్దు చేసి సాయుధ దళాలకు రెగ్యులర్ రిటైర్మెంట్‌ను వర్తింపచేస్తామని ఆయన చెప్పారు.