GHMC : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో జరిగిన లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం పోలింగ్ శాతం 78.57 గా నమోదైంది. ఉదయం ప్రారంభమైన ఓటింగ్ నిరాటంకంగా కొనసాగింది. ఈ ఎన్నికల్లో మొత్తం 88 ఓట్లు నమోదు అయ్యాయి. అందులో 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం ప్రారంభమైన పోలింగ్ సజావుగా కొనసాగి సాయంత్రం 4 గంటలకు…
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జెండాను కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. బీజేపీని స్థాపించిన తొలినాళ్లలో చాలామంది పార్టీని తక్కువచేసి చూశారని, అధికారంలోకి రావడం సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయని ఆయన గుర్తుచేశారు. అయితే అనేకమంది బీజేపీ కార్యకర్తలు నక్సలైట్లు, పాకిస్థాన్ ఐఎస్ఐకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన విషయాన్ని చెప్పారు. జాతీయ భావజాలం కోసం ప్రాణత్యాగం చేసిన వారందరికీ…
కర్ణాటకలోని విద్యా సంస్థల్లో మొదలైన హిజాబ్ వ్యవహారం.. మరికొన్ని రాష్ట్రాలకు పాకింది.. ఇప్పుడు తమిళనాడును కూడా తాకింది.. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా.. మధురైలో హిజాబ్ ధరించి వచ్చిన ఓ మహిళను బీజేపీ బూత్ ఏజెంట్ అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది.. హిజాబ్ తొలగించిన తర్వాతే ఆ మహిళ ఓటు వేయాలని.. అప్పుడే ఓటు వేయడానికి అనుమతించాలంటూ బీజేపీ ఏజెంట్ పోలింగ్ బూత్‌లో వీరంగం సృష్టించాడు.. దీంతో, కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడగా.. డీఎంకే, అన్నాడీఎంకే సహా ఇతర…