GHMC : ప్రశాంతంగా ముగిసిన జీహెచ్‌ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు
- బీఆర్ఎస్ దూరంగా.. ప్రతిపక్షాలు యాక్టివ్‌గా పాల్గొన్న లోకల్ బాడీ ఎన్నికలు
- 78.57 శాతం ఓటింగ్‌తో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల ప్రక్రియ
- ఏప్రిల్ 25న ఓట్ల లెక్కింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GHMC : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో జరిగిన లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం పోలింగ్ శాతం 78.57 గా నమోదైంది. ఉదయం ప్రారంభమైన ఓటింగ్ నిరాటంకంగా కొనసాగింది. ఈ ఎన్నికల్లో మొత్తం 88 ఓట్లు నమోదు అయ్యాయి. అందులో 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం ప్రారంభమైన పోలింగ్ సజావుగా కొనసాగి సాయంత్రం 4 గంటలకు ముగిసింది. ఈ ఎన్నికల పోలింగ్‌లో బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎంకు చెందిన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే, బీహెచ్‌ఆర్ఎస్ (BRS) పార్టీకి చెందిన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు మాత్రం పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. ఇది రాజకీయంగా ఒక కీలక పరిణామంగా అభివర్ణించబడుతోంది.
ఈ లోకల్ బాడీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (కౌంటింగ్) ఈనెల 25న ఉదయం 8 గంటలకు జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ప్రారంభమవుతుంది. అధికార యంత్రాంగం ఇప్పటికే లెక్కింపుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసింది. ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో కౌంటింగ్ జరగనుంది. ప్రతిపక్ష పార్టీలు పాల్గొనడం, ఓటింగ్ శాతం 78.57కి చేరడం, ప్రశాంతంగా ఎన్నిక ముగియడం వంటి అంశాలు ఈ ఎన్నికలలో ప్రజాస్వామ్య విజయాన్ని సూచిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఫలితాల కోసం ఇప్పుడు రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
Also Read
HYDRAA : మారిన హైడ్రా లోగో.. ఇకపై కొత్త లోగోతో హైడ్రా కార్యకలాపాలు
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు