భారత సైన్యం మరోసారి ఉగ్రవాదుల చొరబాటు యత్రాన్ని భంగం చేసింది. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. జమ్మూకశ్మీర్‌లో గురువారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖవెంబడి భారత్‌లోకి చొరబడేందుకు యత్నించిన వారిపై భారత సైన్యం కాల్పులు జరిపింది.
జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) సమీపంలోని నౌషేరాలో ల్యాండ్‌మైన్ పేలింది. ల్యాండ్‌మైన్‌పై కాలుపెట్టడంతో పేలుడు సంబవించి భారత ఆర్మీ జవాన్ వీరమరణం పొందాడు. పేలుడులో మరో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. గాయపడిన సైనికులను ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన సైన్యం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఎల్ఓసీ వెంబడి పెట్రోలింగ్ చేస్తుండగా ఓ జవాన్ ల్యాండ్ మైన్ పై అడుగుపెట్టడంతో ప్రమాదవశాత్తు ట్రిగ్గర్ అయ్యింది. దీంతో పేలుడు సంభవించి ముగ్గురు ఆర్మీ జవాన్లక తీవ్ర…
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్, భారత్‌లో అలజడి రేపేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ముఖ్యంగా జమ్మూకాశ్మీర్‌లో ఉన్న శాంతి పరిస్థితులు పాకిస్తాన్‌కి నచ్చడం లేదు. కాశ్మీర్‌లో దాడులు చేసేందుకు పాక్ స్పాన్సర్డ్ ఉగ్రవాదుల్ని నియంత్రణ రేఖ దాటించి భారత్‌లోకి పంపేందుకు ప్రయత్నిస్తోంది. అయితే గత రాత్రి నలుగురు ఉగ్రవాదుల్ని, భారత్ లోకి ప్రవేశపెట్టేందుకు పాకిస్తాన్ ఆర్మీ తీవ్రంగా ప్రయత్నించింది.
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లోని సున్నితమైన పాయింట్లను మ్యాపింగ్ చేయడంతో పాటు.. డ్రోన్‌ల కదలికలు, డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణాను తనిఖీ చేయడానికి ఏజెన్సీ ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని (SOP) సిద్ధం చేసినట్లు సరిహద్దు భద్రతా దళం (BSF) అధికారులు తెలిపారు. చండీగఢ్‌లో బీఎస్‌ఎఫ్ వెస్ట్రన్ కమాండ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా మాట్లాడుతూ.. భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో డ్రోన్‌ల కదలికలను బీఎస్‌ఎఫ్ పర్యవేక్షిస్తోందని, గత ఏడాది కాలంలో 95 డ్రోన్‌లను కూల్చివేసినట్లు తెలిపారు.
Jammu Kashmir: జమ్మూకాశ్మీర్ ప్రాంతంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రసంస్థలు, పాకిస్తాన్ కుట్రలు చేస్తూనే ఉన్నాయి. పీఓకే నుంచి జమ్మూకాశ్మీర్ లోకి ఉగ్రవాదుల చొరబాట్లను ప్రోత్సహిస్తున్నాయి. ఎల్ఓసీ వెంబడి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్ నుంచి ఉగ్రవాదుల్ని ఇండియాలోకి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే టెర్రిస్టుల ప్రయత్నాలను ఎప్పటికప్పుడు భారత సైన్యం తిప్పికొడుతోంది.
రెండు దేశాల మధ్య సరిహద్దు సమస్యను పరిష్కరించడానికి నేపాల్, భారతదేశం అధికారులు చర్చలకు కూర్చోవాలని నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ సోమవారం అన్నారు.ప్రచండ మే 31 నుంచి జూన్ 3 వరకు భారతదేశాన్ని సందర్శించారు.
Jammu Kashmir: తీవ్ర ఆర్థిక సంక్షోభం, అంతర్గత సమస్యలతో సతమతం అవుతున్న పాకిస్తాన్ తన బుద్దిని మార్చుకోవడం లేదు. భారత్ లో, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులను బోర్డర్ దాటించేందుకు పాకిస్తాన్ ఆర్మీ సిద్ధం అయినట్లు తెలుస్తోంది.