Pakistan Shelling : భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ అనంతరం, జమ్మూ-కశ్మీర్ రాష్ట్రంలోని నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వద్ద పాకిస్తాన్ సైన్యం బుధవారం చేసిన ఘనమైన దాడులు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ దాడుల్లో 15 మంది పౌరులు మరణించగా, 43 మంది గాయపడ్డారు. ధ్వంసమైన ఇళ్లు, పగిలిన దుకాణాలు, దగ్ధమైన వాహనాలు, రక్తపు మరకలు, శిథిలాలతో సరిహద్దు గ్రామాలు భయానకంగా మారిపోయాయి. ఆలయాలు, స్కూళ్లు, మసీదులపై కూడా పాకిస్తాన్ సైన్యం షెల్లింగ్ చేసి దాడి చేసింది.…
India vs Pak : ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత-పాకిస్తాన్ నియంత్రణ రేఖ (LoC) వద్ద పరిస్థితి తీవ్రంగా మారింది. పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తెగబడ్డ విషయం అధికారికంగా భారత సైన్యం ధృవీకరించింది. ఈ కాల్పుల్లో భారత జవాన్ దినేష్ కుమార్ వీరమరణం పొందారు. దినేష్ కుమార్ మృతిపై వైట్ నైట్ కార్ప్స్ సంతాపం తెలియజేసింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఇదే కాల్పుల్లో సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్న 15 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.…
India warns Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అయితే, ఎలాంటి కవ్వింపులు లేకుండానే పాకిస్తాన్ కాల్పు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరుపుతోంది. నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి పదే పదే జరుగుతున్న కాల్పుల ఉల్లంఘనపై భారత్ పాకిస్తాన్‌కి గట్టి వార్నింగ్ ఇచ్చిందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. రెండు దేశాల సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్స్(డీజీఎంఓలు) మంగళవారం హాట్‌లైన్‌లో భారత్ పాకిస్తాన్‌ని హెచ్చరించింది. మంగళవారం ఉదయం వరకు కాల్పుల…
మా దేశం విడిచి వెళ్లిపోండి.. ఏపీలోని పాకిస్థానీయులకు సర్కార్ హెచ్చరికలు.. పాకిస్థాన్ పౌరుల వీసాల రద్దు నిర్ణయంతో యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కలెక్టర్లు, పోలీసు అధికారులకు నోట్ విడుదల చేసింది. వీసాల రద్దు నిర్ణయంపై విస్తృత ప్రచారం కల్పించాలని నిర్దేశించింది. ఈనెల 27 నుంచి వివిధ అవసరాల కోసం జారీ అయ్యే పాకిస్థాన్ వీసాల రద్దు చేసిన అంశాన్ని మారోసారి ప్రస్తావించింది. ప్రభుత్వం, విశాఖ పోలీసులు విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం.. పాకిస్థాన్…
LoC: భారత్‌ని కవ్వించి పాకిస్తాన్ ఆర్మీ మూల్యం చెల్లించుకుంది. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి పాకిస్తాన్ ఆర్మీ కాల్పులకు తెగబడింది. ఎల్ఓసీని దాటే ప్రయత్నం చేసినట్లు భారత ఆర్మీ చెప్పింది. పాక్ ఆర్మీ కాల్పులకు భారత ఆర్మీ ధీటుగా బదులిచ్చింది. ఈ కాల్పుల్లో 4-5 మంది చొరబాటుదారులను హతమార్చినట్లు ఇండియన్ ఆర్మీ వర్గాలు చెప్పాయి. పూంచ్ జిల్లాలోని కృష్ణ ఘాటి ప్రాంతంలో చొరబాటు ప్రయత్నాన్ని విజయవంతంగా తిప్పికొట్టామని సైన్యం తెలిపింది.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లోని అఖ్నూర్ సెక్టార్‌లో ఐఈడీ పేలుడు జరిగింది. ఈ రోజు ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో ఇద్దరు భారత సైనికులు మరణించినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లా నౌషేరా భవానీ సెక్టార్ వద్ద ల్యాండ్ మైన్ పేలింది. భారత్-పాక్ సరిహద్దు నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్ద మంగళవారం ప్రమాదవశాత్తు జరిగిన పేలుడులో ఆరుగురు భారత జవాన్లు గాయపడ్డారు. సాధారణ గస్తీలో భాగంగా జవాన్లు ఆ ప్రాంతం గుండా వెళ్తున్న క్రమంలో అనుకోకుండా మందుపాతర పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. Read Also: Adam Gilchrist: ‘బ్యాటింగ్‌పై దృష్టి పెట్టు.. జుట్టు మీద కాదు’.. భారత్ బ్యాటర్ పై కీలక…
Jammu Kashmir : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడుల ఘటనలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. సోమవారం ఉదయం కూడా అఖ్నూర్‌లోని బట్టల్ ప్రాంతంలో ఆర్మీ అంబులెన్స్‌ను లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
India-Pakistan Border: భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో కాశ్మీర్ వెంబడి నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి పాకిస్తాన్‌కి చైనా సైనిక మద్దతు అందిస్తోంది. గత కొంత కాలంగా సరిహద్దు వెంబడి అత్యాధునిక సౌకర్యాలను పాకిస్తాన్ పెంపొందించుకుంటోంది.