భారత సైన్యం మరోసారి ఉగ్రవాదుల చొరబాటు యత్రాన్ని భంగం చేసింది. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. జమ్మూకశ్మీర్‌లో గురువారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖవెంబడి భారత్‌లోకి చొరబడేందుకు యత్నించిన వారిపై భారత సైన్యం కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. తంగ్‌ధర్ సెక్టార్‌లోని కంచెకు అవతలివైపు మృతదేహాలు పడి ఉన్నాయి. ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
READ MORE: Loose Motions: మోషన్స్ కు చెక్ పెట్టే నేచురల్ రెమెడీస్..
కాగా.. గత నెలలో కూడా జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఈ సందర్భంగా అక్కడ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమైనట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని ఉరీ ప్రాంతంలో సబురా నాలా రుస్తుం వద్ద నియంత్రణ రేఖ వెంబడి అనుమానాస్పద కదలికలను గమనించిన సైన్యం వెంటనే అప్రమత్తమైంది. అక్కడ చొరబాటుదారులను అడ్డుకునే క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడినట్లు అధికారులు తెలిపారు. దీంతో భద్రతా బలగాలు సైతం ఎదురుకాల్పులు జరిపి ఓ ఉగ్రవాదిని హతమార్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతం అక్కడ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు గతంలో తెలిపారు.