మా దేశం విడిచి వెళ్లిపోండి.. ఏపీలోని పాకిస్థానీయులకు సర్కార్ హెచ్చరికలు..
పాకిస్థాన్ పౌరుల వీసాల రద్దు నిర్ణయంతో యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కలెక్టర్లు, పోలీసు అధికారులకు నోట్ విడుదల చేసింది. వీసాల రద్దు నిర్ణయంపై విస్తృత ప్రచారం కల్పించాలని నిర్దేశించింది. ఈనెల 27 నుంచి వివిధ అవసరాల కోసం జారీ అయ్యే పాకిస్థాన్ వీసాల రద్దు చేసిన అంశాన్ని మారోసారి ప్రస్తావించింది. ప్రభుత్వం, విశాఖ పోలీసులు విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం.. పాకిస్థాన్ జాతీయుల వీసాలను రద్దు చేస్తూ భారతీయ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తేదీ 27.04.2025 లోపు భారతదేశం విడిచి వెళ్ళిపోవాలని పాకిస్థాన్ జాతీయులకు హెచ్చరికలు జారీ చేసింది. విదేశీయుల చట్టం – 1946, సెక్షన్ 3(1) ప్రకారం ఉన్న అధికారాల ఆధారంగా పాకిస్థానీ పౌరులకు పలు రకాల వీసా సేవలను తక్షణమే రద్దు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.
గుడ్‌న్యూస్.. రూ.1,121.20 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏపీకి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థల కోసం 15వ ఆర్థిక సంఘం గ్రాంట్స్ విడుదల చేసింది. ఈ గ్రాంట్స్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.1,121.20 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఇందులో పంచాయతీలకు 70%, మండల పరిషత్తులకు 20%, జిల్లా పరిషత్తులకు 10% కేటాయించింది. 2024-25 సంవత్సరానికి రెండో విడతగా కేంద్రం నుంచి నిధులు విడుదలయ్యాయి. జనాభా ఆధారంగా గ్రామీణ స్థానిక సంస్థల బ్యాంకు ఖాతాలల్లో పంచాయతీరాజ్‌శాఖ జమ చేయనుంది.
శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి కండీషన్ !
తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక పుస్తకం అయితే.. అందులో మెగాస్టార్ చిరంజీవిది ఒక పేజీ. ఇప్పటి తరానికి ఆయన అంటే వాల్తేరు వీరయ్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్.. ఇలా ట్రోల్ చేస్తున్నారు కానీ. అసలు ఒకప్పుడు చిరంజీవికి ఉన్న కెపాసిటీ ఇండియాలో ఏ హీరోకి లేదు. చిరంజీవి సినిమా వస్తుందంటే కనీసం వారం, 10 రోజులు ముందు నుంచి థియేటర్‌ల దగ్గర హడావిడి జరిగేది. అంతెందుకు చిరంజీవి ఈవెంట్‌కు వస్తున్నాడంటే జనాలు వేలల్లో కాదు.. లక్షల్లో కదిలి వచ్చేవారు. తెలుగు సినిమా స్థాయిని పెంచిన హీరో చిరంజీవి. ఆయనతో సినిమా చేసే ఛాన్స్ వస్తే జీవితంలో అంతకంటే అదృష్టం ఇంకోటి ఉండదు అనుకోని దర్శకుడు, నిర్మాత ఉండరు. డిస్టిబ్యూటర్‌లు సైతం చిరంజీవి సినిమాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసేవాళ్లు. అంటే దీని బట్ట అర్థం చేసుకోవచ్చు మెగాస్టార్ రేంజ్ ఎలాంటిదో.
ప్రిన్స్ ఆండ్రూపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన గియుఫ్రే ఆత్మహత్య
బ్రిటిష్ రాజకుటుంబ సభ్యుడు ప్రిన్స్ ఆండ్రూపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన వర్జీనియా గియుఫ్రే(41) ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె కుటుంబ సభ్యలు తెలిపారు. అమెరికా మీడియాకు కుటుంబ సభ్యులు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. చాలా ఏళ్లుగా ఆమె ఆస్ట్రేలియాలోని నీర్గాబిలో నివాసం ఉంటోంది. పశ్చిమ ఆస్ట్రేలియాలోని తన పొలంలో మరణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. గుండె బరువుతో ఈ వార్తను తెలియజేస్తున్నట్లు చెప్పారు. అమెరికా ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ , పిన్స్ ఆండ్రూ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని గియుఫ్రే ఆరోపించారు. అమెరికా బిలియనీర్ జెఫ్రీ ఎప్స్టీన్ తనను లైంగిక బానిసగా ఉపయోగించుకున్నాడని ఆమె ఆరోపించింది. అలాగే పిన్స్ ఆండ్రూ అలియాస్ డ్యూక్ ఆఫ్ యార్క్‌పై 2021, ఆగస్టులో గియుఫ్రే లైంగిక వేధింపుల కేసు పెట్టింది. ఆండ్రూ తనతో 17 ఏళ్ల వయసు నుంచి లైంగిక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను ఆండ్రూ పదే పదే ఖండిస్తూ వచ్చాడు. కానీ అతడిపై ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు కాలేదు. ఇక 2022, మార్చిలో గియుఫ్రే-ఆండ్రూ కోర్టులో ఒక పరిష్కారానికి వచ్చినట్లు ప్రకటించారు.
హైదరాబాద్ పోలీసుల అదుపులో పాకిస్థానీ యువకుడు
పహల్గామ్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడి ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపింది. ఈ దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పాకిస్తాన్ పౌరుల విషయంలో కఠినమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే కేంద్రం పాక్ పౌరులకు ఇచ్చిన వీసాలను రద్దు చేసింది. అంతేకాకుండా, భారత్‌లో ఉన్న పాక్ పౌరులకు దేశం విడిచి వెళ్లాలంటూ స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ నిబంధనల మేరకు అన్ని రాష్ట్రాల్లో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. తెలంగాణలోనూ పోలీసు అధికారులు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలను ముమ్మరం చేశారు.
విశాఖలో కలకలం రేపిన దంపతుల దారుణ హత్య…
విశాఖలో దంపతుల దారుణ హత్య కలకలం రేపింది. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. 24 గంటల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మృతులు రిటైర్డ్ నావెల్ డాక్ యార్డ్ ఉద్యోగి గంపల యోగేంద్ర బాబు (66), భార్య లక్ష్మి (52)గా పోలీసులు గుర్తించారు. గుర్తు తెలియని దుండగులు హత్య చేసి ఇంటికి తాళాలు వేసి పారిపోయారు. యోగేంద్ర బాబు మేనల్లుడు.. ఇంటికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో దంపతులు పడి ఉన్నారు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకున్నారు.
జమ్మూకాశ్మీర్ ప్రభుత్వాస్పత్రులకు కీలక ఆదేశాలు.. సర్వం సిద్ధంగా ఉండాలని సర్క్యులర్ జారీ
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ కఠిన చర్యల దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపివేసింది. వీసాలను రద్దు చేసింది. అంతేకాకుండా అటారీ సరిహద్దును మూసేసింది. ఇలా ఒక్కొక్క దెబ్బకొడుతూ వెళ్తోంది. అంతేకాకుండా ఉగ్రవాదులకు ఊహించని రీతిలో శిక్ష విధిస్తామని ఇప్పటికే ప్రధాని మోడీ తీవ్రంగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఏదో జరగబోతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. తాజాగా జమ్మూకాశ్మీర్‌లో సర్వసన్నాహాకాలు జరుగుతున్నాయి. సరిహద్దు తీవ్రవాదం నేపథ్యంలో సర్వసన్నాహక చర్యలు తీసుకుని సిద్ధంగా ఉండాలని కేంద్ర పాలిత ప్రాంతంలోని అన్ని ప్రభుత్వాస్పత్రులకు స్పష్టమైన సంకేతాలు వెళ్లాయి. ఈ మేరకు జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ సర్క్యులర్ జారీ చేశారు.
‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’లో కిరణ్ అబ్బవరం మూవీ
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి పరిచయం అక్కర్లేదు. ‘రాజావారు రాణివారు’ చిత్రంతో హీరోగా అడుగు పెట్టిన వరుస సినిమాలు తీసినప్పటికి అంతగా హిట్ మాత్రం అందుకోలేక పోయ్యాడు. ఇక ఊహించని విధ్దంగా ‘క’ సినిమాతో ఇటీవలే మంచి సక్సెస్‌ను అందుకున్నాడు ఈ టాలెంటేడ్ హీరో కిరణ్. ఫాంటసీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని డాల్బీ విజన్ ఆటమ్స్ టెక్నాలజీతో మేకర్స్ తెరకెక్కించారు. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. రూ.55 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించింది. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం జోడిగా, నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించాగా. సుజిత్ మద్దెల, సందీప్ మద్దెల దర్శకత్వం వహించిన ఈ సినిమా 1970ల నేపథ్యంలో సాగే పీరియడ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది.దీనికి కొనసాగింపు కూడా ఉంటుందని, తొలి పార్ట్‌ని మించేలా ‘క -2’ తెరకెక్కిస్తామని దర్శకులు చెబుతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం అరుదైన ఘనత సాధించాడు కిరణ్ అబ్బవరం.
ఎల్‌ఓసీ దగ్గర పాక్ మళ్లీ కవ్వింపు చర్యలు.. కాల్పుల్ని తిప్పికొట్టిన ఆర్మీ
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి వరుసగా రెండో రోజు పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. పాకిస్థాన్ సైన్యం ఎల్‌ఓసీ వెంబడి కాల్పులకు తెగబడింది. దీంతో భారత్ సైన్యం అప్రమత్తమై.. కాల్పులను తిప్పికొట్టింది. పాక్ సైన్యం కాల్పులను భద్రతా దళాలు తిప్పికొట్టాయని భారత సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. శుక్రవారం కూడా పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు తెగబడింది. శనివారం కూడా అదే రీతిగా తెగబడడంతో ఆర్మీ తిప్పికొట్టింది. అయితే ఈ కాల్పుల్లో ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదని పేర్కొంది.
జీపీవో పరీక్షకు రంగం సిద్ధం.. గ్రామీణ పరిపాలనలో కొత్త ఒరవడి
రాష్ట్రంలోని గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. ఈ దిశగా భూభారతి ఆర్వోఆర్-2025 చట్టంలోని నిబంధనలను అనుసరిస్తూ, గ్రామ పాలన అధికారుల నియామకం (జీపీవో) అవసరమవుతున్న నేపథ్యంలో, సంబంధిత ప్రక్రియను వేగవంతం చేస్తోంది. పూర్వపు వీఆర్వోలు మరియు వీఆర్ఏల ఎంపికకు సంబంధించి పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పరీక్షను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో టీఎస్‌పీఎస్సీ (తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్)కి బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇందుకోసం తగిన భవనాలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.