లోన్ యాప్ కేసులో కీలక నిందితుడిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. లోన్ యాప్ కేసులో మాస్టర్ మైండ్‌తో పాటు.. మరొక నిందితుడు అరెస్ట్ అయ్యారు. తీగ లాగితే డొంకంతా కదిలింది. లోన్ యాప్ నిర్వాహకులు 2000 రూపాయలు అప్పుగా తీసుకొని చెల్లించలేదని ఓ వ్యక్తిని వేధింపులకు దిగారు. దీంతో బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలానికి చెందిన నిమ్మల బోయిన సందీప్ (29) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని అతను ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందిన వెంటనే కుటుంబ సభ్యులు సదాశివనగర్‌కు మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.కుటుంబ సభ్యుల ప్రకారం.. సందీప్ వివిధ క్రెడిట్ కార్డులు, లోన్ యాప్స్ ద్వారా సుమారు 15 లక్షల రూపాయల అప్పు…
ఈఎంఐ డబ్బులు చెల్లించకపోవడంతో న్యూడ్ ఫొటోలు పంపించిన రికవరీ ఏజెంట్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఫిర్యాదు మేరకు ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు..
ఇటీవల కాలంలో లోన్ యాప్‌ల వేధింపులతో ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి.. అవసరాల కోసం ఆన్‌లైన్ యాప్‌లను ఆశ్రయించిన ఘటనలు కొన్ని అయితే.. వారే పిలిచి మరి లోన్‌లు ఇచ్చి.. తర్వాత వేధింపులకు గురిచేసిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి.. లోన్ ఇవ్వడం.. ఆ తర్వాత రకరకాలుగా వేధింపులకు గురి చేయడంతో.. ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నారు. తాజాగా లోన్ యాప్ వేధింపులకు ఓ యువకుడు బలి అయ్యాడు. ఈ ఘటన విశాఖలో చోటుచేసుకుంది.
శ్రీశైలం శిఖరేశ్వరం ఆలయ సమీపంలోని కొండపై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.. ఆమెను గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వెన్నెలగా గుర్తించారు.. ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా తెలుస్తోంది..
లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు రానురాను మితిమీరిపోతున్నాయి. ఇప్పటికే వీరి వేధింపులు భరించలేక ఎంతోమంది ప్రాణాలు తీసుకున్నారు. అయినా వీరిలో మార్పు రాకపోగా..