Shivani Nagaram : లిటిల్ హార్ట్స్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది శివానీ నగరం. ఆమెకు ఈ సినిమాతో మంచి క్రేజ్ వచ్చింది. దీనికంటే ముందు ఆమె సుహాస్ హీరోగా వచ్చిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సినిమాతో హిట్ అందుకుంది. వరుసగా రెండు హిట్లు పడటంతో ఆమెకు వరుస సినిమా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అయితే సాధారణంగా హీరోయిన్లకు హీరోలపై క్రష్ ఉండటం కామనే కదా. మరి ఈ యూత్ ఫుల్ బ్యూటీకి కూడా ఓ స్టార్…
Little Hearts : చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రం ‘ లిటిల్ హార్ట్స్ ‘. ఈ చిత్రం యువతను కట్టిపారేసింది. బోసిపోయిన బాక్సాఫీస్ కు ఊపిరి పోసింది. కంటెంట్ ఉంటే మంచి సినిమాని ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ రెడీగా ఉంటారనే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. మౌళి తనూజ్, శివానీ నాగరం హీరో హీరోయిన్లుగా ‘లిటిల్ హార్ట్స్’ చిత్రం తెరకెక్కింది. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్‌లో సాయి మార్తాండ్ తెరకెక్కించిన సినిమా థియేటర్లలో…
సినిమా మీద ప్యాషన్ తో ఇండస్ట్రీకి వస్తున్న యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేసేందుకు ఎప్పుడూ ముందుంటారు హీరో విజయ్ దేవరకొండ. చిన్న సినిమాల నుంచే స్టార్ గా ఎదిగిన విజయ్ కు కొత్త టీమ్ పడే కష్టాలు తెలుసు. స్టార్స్ ఇచ్చే చిన్న సపోర్ట్ వారిలో ఎంత కాన్ఫిడెంట్ పెంచుతుందో తెలుసు. అందుకే చిన్న చిత్రాల రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ లిటిల్ హార్ట్స్ సక్సెస్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరై వారికి…
Little Hearts Jai Krishna : అవును.. టాలీవుడ్ కు కొత్త కమెడియన్ వచ్చాడు. తన మీమ్స్, రీల్స్ టైమింగ్స్ ను సినిమాల్లో చూపిస్తూ దుమ్ము లేపాడు. అతనెవరో కాదు లిటిల్ హార్ట్స్ సినిమాతో హీరోతో సమానంగా ఆకట్టుకున్న జై కృష్ణ. డైరెక్టర్ బుచ్చిబాబు తీసిన ఉప్పెన మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాలో హీరో పక్కన చాలా సీన్లలో కనిపించాడు. ఆ మూవీతో మంచి గుర్తింపు వచ్చింది. దాని తర్వాత అతనికి చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు.…
Little Hearts : మౌళి తనూజ్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాడు. ఇన్ స్టా గ్రామ్ లో రీల్స్ చేసుకునే దగ్గరి నుంచి సినిమాలో హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేదాకా ఎదిగాడంటే మామూలు విషయం కాదు. సినిమా బాగుంటే చిన్న సినిమానా.. పెద్ద మూవీనా అని చూడకుండా ప్రేక్షకులు నెత్తిన పెట్టేసుకుంటారు. అది కామన్. కానీ ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి. మౌళి తన సినిమాను ప్రమోట్ చేసుకున్న విధానం. సొంతంగా కంటెంట్ క్రియేటర్…
మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన “లిటిల్ హార్ట్స్” సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను అద్భుతంగా ప్రమోట్ చేసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ బన్నీ వాస్ తన బీవీ వర్క్స్, వంశీ నందిపాటి తన వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై వరల్డ్…
సీనియర్ నటుడు జగపతిబాబు తన రెండో ఇన్నింగ్స్‌లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వరుసగా వినూత్నమైన పాత్రలు చేస్తూ టాలీవుడ్‌లో బిజీగా ఉన్నారు. ఇటీవల టాక్ షో హోస్ట్‌గా కూడా మారి మరోవైపు తన ప్రతిభను చూపించారు. ఇక ఇప్పుడు ఆయన కెరీర్‌లో మరో కొత్త చాప్టర్ ప్రారంభించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’ చిత్రంలో హీరో తండ్రి పాత్రలో కనిపించిన రాజీవ్ కనకాల స్థానంలో అసలు జగపతిబాబు ఉండాల్సింది. దర్శకుడు…
Shivani Nagaram : తెలుగు అమ్మాయి శివానీ నగరం వరుస హిట్లతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇప్పటి వరకు ఈ బ్యూటీ చేసిన సినిమాలు అన్నీ ఫీల్ గుడ్ ఉన్నవే. ఆమె సుహాస్ తో చేసిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ మంచి హిట్ అయింది. ఆ సినిమాలో ఈమె పాత్రకు ప్రశంసలు దక్కాయి. దాని తర్వాత ఆమె లీడ్ రోల్ లో చేసిన 8వసంతాలు యూత్ ను కట్టిపడేసింది. ఫీల్ గుడ్ మ్యూజిక్, సీన్లు,…
“లిటిల్ హార్ట్స్” సినిమాకు ప్రేక్షకుల ఆదరణతో పాటు ప్రముఖుల ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. తాజాగా దర్శకుడు సాయి రాజేశ్ ఈ సినిమా టీమ్ కు తన అభినందనలు అందించారు. Also Read:Breaking News: నేపాల్‌లో ఆగని ఆందోళనలు.. మాజీ ప్రధాని భార్య సజీవ దహనం సాయి రాజేశ్ ఇన్ స్టాలో స్పందిస్తూ – ‘”లిటిల్ హార్ట్స్” సినిమా చూశాను, కంటెంట్ మాత్రమే నిజమైన సూపర్ స్టార్ అని, కంటెంట్ క్రియేట్ చేయగలిగిన వాడే నిజమైన తోపు అని…
మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన తాజా చిత్రం *”లిటిల్ హార్ట్స్”* ప్రేక్షకులను అలరిస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించిన ఈ హోల్‌సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, నిర్మాత ఆదిత్య హాసన్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బన్నీ వాస్ తన బీవీ వర్క్స్ మరియు వంశీ నందిపాటి తన వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని అద్భుతంగా ప్రమోట్ చేసి, వరల్డ్ వైడ్…