మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన “లిటిల్ హార్ట్స్” సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను అద్భుతంగా ప్రమోట్ చేసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ బన్నీ వాస్ తన బీవీ వర్క్స్, వంశీ నందిపాటి తన వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేట్రికల్ గా రిలీజ్ చేశారు.
Also Read : Spa Center: బయట నుంచి చూస్తే స్పా సెంటర్.. లోపల మాత్రం వ్యభిచారం..
హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన “లిటిల్ హార్ట్స్” సినిమా రోజు రోజుకూ కలెక్షన్స్ పెంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ హోల్డ్ తో దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి ఇప్పటివరకు వరల్డ్ వైడ్ 32.15 కోట్ల రూపాయల వసూళ్లు దక్కాయి. ప్రతి వారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా ఆ పోటీని తట్టుకుని లిటిల్ హార్ట్స్ట్ బాక్సాఫీస్ వద్ద స్టడీగా కలెక్షన్స్ సాధిస్తోంది. 32.15 కోట్ల రూపాయల వసూళ్లతో చిన్న చిత్రాల్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ దిశగా దూసుకెళ్తోందీ సినిమా.