“లిటిల్ హార్ట్స్” సినిమాకు ప్రేక్షకుల ఆదరణతో పాటు ప్రముఖుల ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. తాజాగా దర్శకుడు సాయి రాజేశ్ ఈ సినిమా టీమ్ కు తన అభినందనలు అందించారు.
Also Read:Breaking News: నేపాల్‌లో ఆగని ఆందోళనలు.. మాజీ ప్రధాని భార్య సజీవ దహనం
సాయి రాజేశ్ ఇన్ స్టాలో స్పందిస్తూ – ‘”లిటిల్ హార్ట్స్” సినిమా చూశాను, కంటెంట్ మాత్రమే నిజమైన సూపర్ స్టార్ అని, కంటెంట్ క్రియేట్ చేయగలిగిన వాడే నిజమైన తోపు అని ప్రూవ్ అయ్యింది. కాలం మారింది, మనం కూడా మారకపోతే ఎవరినో నిందిస్తూ బతకాలి, “లిటిల్ హార్ట్స్” బ్యూటిఫుల్ ఫిలిం, ఒక్క 5 నిమిషాలు కూడా మన మొహం మీద చిరునవ్వు పక్కికి పోదు. మార్తాండ్ సాయి, ఆదిత్య హాసన్, సింజిత్, మౌళికి నా ప్రశంసలు. ప్రతి రెండేళ్లకో, మూడేళ్లకో ఎవడో వచ్చి ఇలా బాక్సాఫీస్ లు బద్దలుకొట్టి పోతుంటాడు, మనకు బుద్ధి రాదు, అంతే..’ అంటూ పేర్కొన్నారు. మౌళి తనూజ్, శివానీ నగరం జంటగా నటించిన “లిటిల్ హార్ట్స్” సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.