హైదరాబాద్‌లోని మందు బాబులకు అలెర్ట్.. 24 గంటల పాటు మద్యం షాపులు మూతపడనున్నాయి… హనుమాన్ జయంతి శోభాయాత్ర నిర్వహించేందుకు భాగ్యనగరం సిద్ధమైంది.. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని రేపు గౌలిగూడ రాంమందిర్ నుండి తాడుబందు హనుమాన్ ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించనున్నారు.. ఈ నేపథ్యంలోసైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆంక్షలు విధించారు పోలీసులు.. రేపు ఉదయం 6 గంటల నుండి ఆదివారం ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు, బార్స్, రెస్టారెంట్స్, కల్లు దుకాణాలు మూసివేయాలని సైబరాబాద్ పోలీస్…
కట్టుకున్న భర్తను భార్యతో పాటు ఆమె తల్లిదండ్రులు కలిసి అతి దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది. కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం బీడీ కాలనీ లో ఈ దారుణం చోటుచేసుకుంది. మృతిచెందిన వ్యక్తి 36 సంవత్సరాల కాసాల బ్రహ్మయ్య చారిగా గుర్తించారు. కాసాల బ్రహ్మయ్య చారిని హత్యచేసింది భార్య నందిని, మామ దత్తాత్రేయ, అత్త గంగామణిలుగా పోలీసులు గుర్తించారు. రూరల్ సీఐ శ్రీనివాస్ ఈ ఘటనకు సంబంధించిన వివరాలు అందచేశారు. బీబీపేట మండల కేంద్రానికి చెందిన…
హైదరాబాద్ లో సంచలనం కలిగించిన పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసు ఎఫ్ ఐ ఆర్ లో మొత్తం నలుగురు నిందితులు చేర్చారు బంజారాహిల్స్ పోలీసులు.నిందితులుగా అనిల్, అభిషేక్ , కిరణ్ రాజ్, అర్జున్. పరారీలో అర్జున్, కిరణ్ రాజ్ ల కోసం గాలిస్తున్న పోలీసులు. ఇప్పటికే అరెస్ట్ అయిన అనిల్, అభిషేక్ లను రిమాండ్ కు తరలించనున్నారు పోలీసులు. డ్రగ్స్ కేస్ FIRలో కీలకాంశాలు వున్నాయని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. శనివారం అర్ధ రాత్రి దాటిన…
సమయం ఏదైనా.. సందర్భం ఏదైనా.. చుక్కా, ముక్కా ఉండాల్సిందే.. అదే మందు.. మటనో.. చికెన్ ఉండాల్సిందే.. ఇదే ఇప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తూ మద్యం అమ్మకాలు జరిగేలా చేసింది.. 2021-22 ఏడాదిలో తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు సాగాయి.. ఈ ఆర్థిక సంవత్సరంలో మద్యం డిపోల నుండి రూ.30,711 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి.. ఈరోజు ఒక్క రోజే రూ.235 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని అధికారులు వెల్లడించారు.. మొత్తంగా ఇవాళ్టితో…
తెలంగాణ వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయి.. కరోనా కారణంగో గత రెండేళ్లుగా సామూహిక వేడకలకు దూరమైన ప్రజలు.. ఈ సారి హోలీ పండుగను మంచి జోష్‌లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే, హోలీ వేడుకల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వ్యవహారం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది.. తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో పాల్గొన్న మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్.. చేతులో మందు బాటిల్ పట్టుకుని కార్యకర్తలతో కలిసి చిందులేశారు.. ఇక, మందు బాటిల్‌తో…
హోలీ వేడుకలతో జంటనగరాల పరిధిలో పోలీసులు 48 గంటల పాటు ఆంక్షలు విధించారు. హైదరాబాద్ పరిధిలో హోలీ రోజు మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బులు మూసివేయాలని ఆదేశించారు. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలపై నిషేధం విధించారు. అపరిచిత వ్యక్తులు, వాహనాలు, భవనాలపై రంగులు పోయడం చేయకూడదని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని…
ఫైర్ బ్రాండ్‌గా పేరుపొందిన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత ఉమా భారతి.. సొంత పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో హల్ చల్ చేశారు.. మద్య నిషేధాన్ని అమలు చేయాలనంటూ డిమాండ్ చేస్తూ వస్తున్న ఆమె.. ఇవాళ ప్రత్యక్ష కార్యాచరణకు దిగింది… వైన్ షాపులోకి వెళ్లి రాళ్లతో దాడి చేసి.. మద్యం బాటిళ్లను ధ్వంసం చేసింది… ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.. Read Also: Sonia Gandhi: కాంగ్రెస్ అధినేత్రి కీలక…
డ్రై అంటే ఎండిపోడం, డే అంటే రోజు. డ్రైడే అంటే ఎండిపోయిన రోజు అని అర్థం. డ్రైడే అనే పదాన్ని దేనికోసం వాడతారు అంటే, లిక్కర్ హాలిడే కోసం డ్రైడే అనే పదాన్ని వినియోగిస్తారు. సాధారణంగా దేశంలో లిక్కర్ షాపులను బంద్ చేసిన రోజును డ్రైడే అని పిలుస్తారు. దేశంలో అన్ని ప్రాంతాల్లో డ్రైడే ఒకేవిధంగా ఉండదు. జనవరి 26, ఆగస్ట్ 15, అక్టోబర్ 2 తేదీల్లో దేశవ్యాప్తంగా లిక్కర్ హాలిడే కాబట్టి ఆరోజుల్లో డ్రైడే నడుస్తుంది.…
మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల పని వేళలను మరో గంట పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్… ప్రభుత్వ మద్యం దుకాణాల్లో రాత్రి 10 గంటల వరకు తెరుచుకునే వెసులుబాటు కల్పించింది… మద్యం సేల్స్ అకౌంట్ల నిర్వహణకు మరో గంట సమయాన్ని పెంచినట్టు ప్రభుత్వం పేర్కొంది.. రాష్ట్రంలో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదు కావడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మద్యం దుకాణాలకు వెసులుబాటు…
ఏ దేశంలో అయినా మద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతుంది. ప్రభుత్వాలకు అధిక ఆధాయం తెచ్చిపెట్టే వాటిల్లో మద్యం ఒకటి. అయితే, కొన్ని దేశాల్లోని ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మద్యపానంపై నిషేధం విధిస్తుంటాయి. అయితే, తాలిబన్ ఏలుబడి ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లో ఇస్లామిక్ చట్టాలకు లొబడి మద్యం పై నిషేధం విధించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో మద్యం సేవించినా, అమ్మినా నేరం. ఇలాంటి నేరాలతో పట్టుబడితే వారికి కఠిన శిక్షలు విధిస్తారు. ఇక ఇదిలా ఉంటే, ఇటీవలే…