వైన్ ఎంత కాలం నిల్వ ఉంచితే అంత టేస్ట్ ఉంటుంది. ధర కూడా అదే రేంజ్ లో ఉంటుంది. పాతకాలం నాటి వైన్ బాటిల్స్ కోసం చాలా మంది వెతుకుతుంటారు. స్పెయిన్‌లో ఆర్టియో రెస్తారెంట్ వైన్‌కు ప్రసిద్ధి. ఇక్కడ పాతకాలం నాటి వైన్ దొరుకుతుంటుంది. ఈ రెస్టారెంట్‌లో వైన్ సేవించేందుకు అధిక సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. అయితే, బుధవారం రోజున ఓ జంట వైన్ కోసం రెస్టారెంట్‌కు వచ్చింది. కావాల్సిన వైన్ కొనుగోలు చేయడమే కాకుండా అక్కడి…
మందు, సిగరేట్ కు అలవాటు పడిన వ్యక్తులు దాని నుంచి బయటపడాలి అంటే చాలా కష్టం. ఒకసారి అలవాటు పడ్డారంటే క్రమంగా అది వ్యసనంగా మారుతుంది. ఈ వ్యసనం నుంచి బయటపడటం చాలా కష్టం. ఈ వ్యసనాలు తప్పుడు మార్గంలో నడిపించేలా చేస్తుంటాయి. వీటి నుంచి బయటపడేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. చివరకు మావల్ల కాదులే అని చెప్పి మళ్లీ ఆ వ్యసనాలకు బానిసలవుతుంటారు. అలాంటి వారు ఓ సింపుల్ ట్రిక్‌ను ఫాలో అయితే తప్పకుండా ఈ…
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రలోభాల పర్వంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతోంది.. అక్కడ అంత డబ్బు పంచుతున్నారాట.. ఈ బ్రాండ్ లిక్కర్ ఇస్తున్నారట అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఇక, ఈ ఎన్నికలపై బెట్టింగ్‌లు కూడా నడుస్తున్నాయట.. అయితే, హుజురాబాద్ ఉప ఎన్నికల వ్యవహారం ఇప్పుడు మానవ హక్కుల కమిషన్‌కు చేరింది.. డబ్బులు, మద్యం పంపిణీపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు. హుజురాబాద్ ఉపఎన్నికల ప్రచారం నేటితో ముగియగా.. రాజకీయ పార్టీల అభ్యర్థులు…
కరీంనగర్ జిల్లాలో మద్యం అమ్మకాలు భారీగా సాగాయి. దసరా చివరి రోజు కారణంగా మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి. రెండు రోజుల వ్యవధిలో జిల్లాలో 23 కోట్ల 20 లక్షల మేర మద్యం అమ్మకాలు జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. దసరా ఫెస్టివల్, హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో అమ్మకాలు పెరిగినట్టు తెలుస్తోంది. హుజురాబాద్ నియోజక వర్గంలో మద్యం ఏరులై పారుతున్నది. మద్యం అమ్మకాలు 53 శాతం పెరిగనట్టు అధికారులు చెబుతున్నారు. వైన్ షాపుల వద్ద విపరీతమైన…
ఏపీలో మద్యం విమోచన ప్రచార కమిటీ ఆధ్వర్యంలో మద్యం వద్దు-కుటుంబం ముద్దు కార్యక్రమంలో చైర్మన్ లక్ష్మణ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో భారీ గా మధ్యం అమ్మకాలు తగ్గాయి. గత రెండు సంవత్సరాలుగా మద్యం అమ్మకాలు 40 శాతం, బీరు అమ్మకాలు 78 శాతం తగ్గాయి అని చెప్పారు. చంద్రబాబు హయంలో భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నెలకు ముప్పై నాలుగు లక్షల కేసులు మద్యం అమ్మకాలు జరగ్గా… నేడు 21 లక్షల కేసులకు…
ఏపీలో అక్రమ మద్యం గుట్టు రట్టయ్యింది. ఢిల్లీ నుండి విశాఖకు భారీగా మద్యం బాటిళ్ళు తెచ్చి అమ్ముతున్నాడు సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ చింతల గౌరీ శంకర్. విశాఖ నుండి విమానంలో ఢిల్లికి వెళ్లి అక్కడ నుండి మద్యంతో తిరిగి రైళ్ళులో చేస్తాడు. సిఐఎస్ఎఫ్ చెందిన ట్రంక్ పెట్టిలో మద్యం రవాణ చేస్తున్నాడు. ఢిల్లీ నుండి ఇక్కడికి మద్యం తెచ్చి అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో అరెస్టు చేసారు ఎక్సైజ్ పోలీసులు. న్యూ ఢిల్లీ వెళ్లి రమేష్ అనే వ్యక్తి దగ్గర…
మందు బాబులకు షాకింగ్ న్యూస్ చెప్పింది తమిళనాడు ప్రభుత్వం.. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది.. ఇకపై ఆధార్ కార్డు, కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నట్టు సర్టిఫికెట్ ఉంటేనే మద్యం విక్రయించే విధంగా నిర్ణయం తీసుకున్నారు.. అయితే, ఇది ప్రస్తుతానికి నీలగిరి జిల్లాలో అమలు చేస్తున్నారు. మద్యం కొనుగోలు చేయాలంటే ఆధార్ కార్డు, కరోనా టీకా వేయించుకున్న సర్టిఫికెట్ చూపించాల్సిందేనని స్పష్టం చేశారు అధికారులు… కాగా, నీలగిరి జిల్లాలో 76 మద్యం దుకాణాలుండగా రోజూ రూ.కోటి…
తెలంగాణలో అక్టోబర్ నెలతో ఇప్పుడున్న 2,216 లిక్కర్ షాపుల లైసెన్సులు ముగియనున్నాయి. ఈ లైసెన్సులు ముగిసిన తరువాత మద్యం షాపుల వేలం ప్రక్రియ ఉంటుంది. రాష్ట్రంలో సెప్టెంబర్ చివరినాటికి కొత్త మద్యం పాలసీని అమలులోకి తీసుకొచ్చేందుకు ఎక్సైజ్ శాఖ సన్నాహాలు చేస్తున్నది. ఇక ఈ వేలం లైసెన్స్ ఫీజులు పెంచాలని ప్రభుత్వం చూస్తున్నది. దీని ద్వారా ప్రభుత్వానికి అదనంగా రూ.1200 కోట్ల రూపాయల ఆదాయం లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న 2,216 లిక్కర్ షాపులతో పాటుగా…
మద్యం మాఫియా ఓ మహిళా పోలీసును బలి తీసుకుంది.. బీహార్‌లో రెచ్చిపోయిన మద్యం మాఫియా.. నాటుసారా స్థావరాలపై దాడులు చేసేందుకు వెళ్లిన పోలీసులపై.. సారా తయారీదారులు తిరగబడ్డారు.. పోలీసులను పరిగెత్తించి మరీ కొట్టారు.. కర్రలతో విచక్షణారహితంగా విరుచుకుపడ్డారు.. ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపినా లాభం లేకుండా పోయింది.. మహిళలు, చిన్నారులు ఇలా అంతా కలిసి మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు.. పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు.. ఈ ఘటనలో పదుల సంఖ్యలో పోలీసులకు గాయాలు కాగా.. ఓ మహిళా…