మద్యం దుకాణాల దరఖాస్తులకు గడువును పొడిగించింది ప్రభుత్వం.. మద్యం టెండర్ల షెడ్యూల్‌ను మార్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తుండగా.. వారికి శుభావర్త చెబుతూ గడువు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది..
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం భారీగా దరఖాస్తులు అందాయి. ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ, అలాగే ఆఫ్‌లైన్‌లోనూ లైసెన్సుల దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. వీటికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారి నంచి 2 లక్షల నాన్ రిఫండబుల్ మొత్తాన్ని వసూలు చేస్తున్నారు.
ఏపీలో మద్యం షాపులకు మందకోడిగా దాఖలవుతున్నాయి టెండర్లు. ఆరు రోజుల వ్యవధిలో 3,396 షాపులకు గానూ కేవలం 8,274 టెండర్లే దాఖలు అయ్యాయి.. స్టేట్ యావరేజ్ లెక్కల ప్రకారం ఒక్కో మద్యం షాపునకు 2-3 టెండర్లు మాత్రమే వచ్చాయంటోంది ఏపీ ఎక్సైజ్ శాఖ. భారీ ఎత్తున సిండికేట్లు ఏర్పడడంతో ప్రభుత్వ అంచనాలకంటే తక్కువగా మద్యం టెండర్లు వస్తున్నట్టు అంచనావేస్తున్నారు.
ప్రభుత్వ మద్యం షాపుల విధానానికి స్వస్తి పలుకుతూ రాష్ట్రంలో నూతన మద్యం పాలసీకి నోటిఫికేషన్ జారీ చేసామని ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ తెలిపారు.
మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా మద్యంషాపులు మూతపడ్డాయి.. నిన్నటితో వైన్ షాపుల్లో కాంట్రాక్టు ఉద్యోగుల కాంట్రాక్టు కాలం పూర్తి అయ్యింది.. అయితే, మరో 10 రోజులు వైన్ షాపులు తెరవాలని కోరింది ఏపీ ప్రభుత్వం.. కానీ, పది రోజుల తర్వాత తమ ఉద్యోగాలు ఉండవని, ప్రైవేట్ వైన్ షాప్స్ వస్తాయి కాబట్టి.. ఇవాళ నుంచి విధుల్లోకి రాలేదు సిబ్బంది..
ఆంధ్రప్రదేశ్‌లో మందు బాబులకు గుడ్ న్యూస్.. గత కొంత కాలంగా మద్యం షాపులు బంద్ కానున్నాయంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.. అయితే, రాష్ట్రంలో యథావిధిగానే పని చేయనున్నాయి ప్రభుత్వ మద్యం దుకాణాలు.. బంద్ ని నిరవధికంగా వాయిదా వేసింది ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ సేల్స్ మెన్స్ అండ్ సూపర్వైజర్ల అసోసియేషన్..
ఎన్నికల ప్రచార పర్వం తుది అంకానికి చేరుకుంది. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ప్రచార పర్వానికి ఫుల్ స్టాప్ పడుతుంది. మైకులు బంద్ కాబోతున్నాయి. సుధీర్ఘంగా సాగిన ప్రచారానికి తెరపడబోతోంది. పార్టీలకు మిగిలింది కొన్ని గంటలే. ఈ సమయాన్ని పక్కాగా ఉపయోగించుకుని ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహ రచన చేస్తున్నాయి. చివరిరోజు అగ్రనేతల ప్రచారాలతో హోరెత్తించనున్నాయి.
రేపు(మంగళవారం) వైన్ షాపులు, బార్లు తెరుచుకోవు. హనుమాన్ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. హనుమాన్ జయంతి నేపథ్యంలో ఈ నెల 23న శోభాయాత్రను వైభవంగా నిర్వహించనున్నారు.
అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు జనవరి 22న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సెలవు ప్రకటించారు. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడంతో పాటు ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు ఉండవని ముఖ్యమంత్రి తెలిపారు.
Liquor Shops all over Telangana Re opened after Polling: మందుబాబులకు అలెర్ట్, భాగ్యనగర వ్యాప్తంగా ఉన్న మద్యం షాపులు తెరుచుకున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మద్యం, కల్లు దుకాణాలు.. అలాగే వైన్స్, బార్లు అన్నీ కూడా ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలను నిలిపి వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సాయంత్రం 30వ తేదీ పోలింగ్…