విశాఖలో మద్యం అమ్మకాల సొమ్ము అవకతవకల ఘటనతో ఎక్సైజ్ శాఖ అలెర్ట్ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మద్యం దుకాణాల్లో తనిఖీలు.. స్పెషల్ డ్రైవ్‌కు డెప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆదేశించారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా మద్యం అమ్మకాల సొమ్ము డిపాజిట్.. రికార్డులను పరిశీలించనున్నారు ఎక్సైజ్ ఉద్యోగులు. తమ పరిధిలోని దుకాణాలను కాకుండా.. జంబ్లింగ్ పద్దతిలో స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఎక్సైజ్ శాఖ సీఐలకు తెలిపింది. మొత్తం 2894 దుకాణాల్లో తనిఖీలు చేపట్టాలని సూచించింది. విశాఖ సహా…
దేశంలో కరోనా కేసులు మెల్లిగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇదే క్రమంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా వేగంగా జరుగుతోంది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ ఒక్కటే అస్త్రం కావడంతో ఉత్తర్‌ప్రదేశ్ ఇటావా జిల్లా యంత్రాంగం వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. వ్యాక్సిన్ వేయించుకున్నట్టు సర్టిఫికెట్ చూపించిన వాళ్లకే మద్యం విక్రయించేలా ఆదేశాలు జారీచేసింది. మద్యం దుకాణాల వద్ద ప్రత్యేక నోటీసు బోర్డులు అంటించేలా చర్యలు చేపట్టింది. కరోనా టీకా వేయించుకున్నట్టుగా ధ్రువీకరణ పత్రాన్ని చూపించిన తర్వాతే అమ్ముతున్నామన్నారు.
తెలంగాణలో రేపటి నుంచి లాక్‌డౌన్ అమలు జరగబోతున్న సంగతి తెలిసిందే. 10 రోజులపాటు లాక్‌డౌన్ అమలులో ఉండబోతున్నది. రేపటి నుంచి లాక్‌డౌన్ కావడంతో మద్యం షాపుల వద్ద లిక్కర్ కోసం మందుబాబులు పెద్ద ఎత్తున క్యూలు కట్టారు. ఒక్కసారిగా మందుబాబులు షాపుల వద్దకు చేరుకోవడంతో తోపులాట జరిగింది. కరోనా నిబందనలు గాలికోదిలేశారు. భౌతికదూరం పాటించడంలేదు. ఎక్కడ మద్యం దొరకదో అని చెప్పి ఒక్కక్కరు పెద్ద ఎత్తున మద్యం కొనుగోలు చేస్తున్నారు. అయితే ఉదయం 6గంటల నుంచి 10 గంటల…