Argentina vs France, FIFA World Cup 2022 Final: క్రీడాభిమానుల కళ్లన్ని ఇప్పుడు ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పైనే ఉన్నాయి. ఈ మ్యాచ్ కోసం యావత్ ప్రపంచం, ఫుట్ బాల్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఖతార్ లో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు అంతా సిద్దం అయింది. ఆదివారం లుసైన్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అర్జెంటీనా డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ తో తలపడనుంది.
ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ తుదిదశకు చేరింది. డిఫెండింగ్ ఛాంపియన్, మాజీ ఛాంపియన్ జట్లూ ఫైనల్లో టైటిల్ కోసం తలపడేందుకు సిద్ధం అయ్యాయి. అయితే తుదిపోరుకు ముందే ఫ్రాన్స్‌కు భారీ దెబ్బ తగిలింది.
Byjus: ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఫుడ్బాలర్లలో లియోనెల్ మెస్సీ ఒకరు. ఆ స్టార్ ప్లేయర్‌ని ఎడ్టెక్ స్టార్టప్ బైజూస్.. ‘ఎడ్యుకేషన్ ఫర్ ఆల్’ అనే సామాజిక కార్యక్రమానికి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ సంస్థ లేటెస్ట్గా తీసుకున్న ఈ నిర్ణయాన్ని.. ‘2ఎక్స్’ ఫౌండర్ మరియు పబ్లిక్ స్పీకర్ రిషభ్ ధేడియా తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు లింక్డిన్లో హాట్ హాట్‌గా పోస్టింగ్ పెట్టారు.
అర్జెంటీనాకు చెందిన పుట్‌బాల్ స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ కరోనా బారిన పడ్డాడు. మెస్సీతో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లకు కూడా కరోనా సోకినట్లు సమాచారం అందుతోంది. జర్మన్ క్లబ్ పీఎస్జీ తరఫున ఆడుతున్న మెస్సీ ప్రస్తుతం ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఫ్రెంచ్ కప్‌లో ఆడుతున్నాడు. సోమవారం వాన్నెస్ జట్టుతో పీఎస్జీ జట్టు తలపడాల్సి ఉంది. అయితే మెస్సీ కరోనా వైరస్ బారిన పడటంతో ఆ జట్టు ఆందోళనకు గురవుతోంది. ప్రస్తుతం మెస్సీ సెల్ఫ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నాడు.…
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ మరో అరుదైన రికార్డు సాధించాడు. ఫుట్‌బాల్ ఆటలో ప్రతిష్టాత్మక బాలన్ డార్ అవార్డును ఏడుసార్లు అందుకుని మెస్సీ చరిత్ర సృష్టించాడు. ఇటీవల జరిగిన కోపా అమెరికా టోర్నీలో 34 ఏళ్ల మెస్సీ తమ దేశ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ టోర్నీ ఫైనల్లో బ్రెజిల్‌పై అర్జెంటీనా 1-0 తేడాతో టైటిల్ కైవసం చేసుకుంది. దీంతో 28 ఏళ్ల తర్వాత అర్జెంటీనాకు మెస్సీ మెగా టోర్నీ టైటిల్ అందించాడు. Read Also:…
మాంచెస్టర్ సిటీతో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో పీఎస్జీ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ గోల్ సాధించడంతో పారిస్ నగరం దద్దరిల్లింది. రెండు దశాబ్దాల పాటు బార్సిలోనా క్లబ్‌కు ఆడిన మెస్సీ.. పీఎస్జీ తరఫున తన తొలి గోల్ సాధించి జట్టుకు 2-0తో విజయాన్ని అందించడంతో అభిమానులు పండగ చేసుకున్నారు. తమ ఆరాధ్య ఆటగాడు తొలిసారి తమ క్లబ్ తరఫున గోల్ చేయడంతో అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. 74వ నిమిషంలో ఎంబపే అందించిన అద్భుతమైన పాస్‌ను మెస్సీ…