Lionel Messi Confirms His Retirement After Fifa World Cup Final Match: అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ తాజాగా సంచలన ప్రకటన చేశాడు. ఇదే తన చివరి ప్రపంచకప్ అంటూ బాంబ్ పేల్చాడు. ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ మెస్సీకి చివరిదని ఊహాగానాలు వస్తున్న తరుణంలో.. అది నిజమా? కాదా? అని ప్రశ్నించగా.. నిజమేనంటూ అతడు కుండబద్దలు కొట్టాడు. సెమీ ఫైనల్స్‌లో 3-0 తేడాతో క్రొయేషియాను ఓడించి, అర్జెంటీనా ఫైనల్‌కి వెళ్లిన నేపథ్యంలో.. అతడు మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగానే తన రిటైర్మెంట్‌పై సంచలన ప్రకటన చేశాడు.
Arjun Tendulkar: తండ్రి బాటలో తనయుడు.. తొలి రంజీ మ్యాచ్‌లోనే సెంచరీ
మెస్సీ మాట్లాడుతూ.. ‘‘ఈ ఫిఫా వరల్డ్‌కప్‌లో మా అర్జెంటీనా జట్టు ఫైనల్స్‌కు చేరడం సంతోషంగా ఉంది. ఈ ఫైనల్స్‌లో చివరి మ్యాచ్ ఆడిన తర్వాత.. ఫుల్‌బాల్ వరల్డ్‌కప్ ప్రయాణానికి ముగింపు పలకబోతున్నాను. నా వరల్డ్‌కప్ ప్రయాణాన్ని ఫైనల్ మ్యాచ్‌తో ముగిసేలా.. ఇప్పటివరకూ సాధించిన విజయాలకు సంతోషంగా ఉన్నాను. మరో ప్రపంచకప్ అంటే.. చాలా సంవత్సరాల సమయం పడుతుంది. అప్పటివరకూ ఇలాగే ఆడగలుగుతానని అనుకోవడం లేదు. ఈ రకంగా ముగించడమే ఉత్తమమని భావిస్తున్నా. మేమింకా ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నాం. ఈసారి వరల్డ్‌కప్ సాధించేలా మేము సర్వశక్తులా పోరాడుతాం’’ అంటూ మెస్సీ చెప్పుకొచ్చాడు. మెస్సీ రిటైర్మెంట్ ప్రకటన.. అభిమానులకు మింగుడుపడని విషయమే!
Polluted Water : మైలారదేవ్‌పల్లిలో కలుషిత జలాల కలకలం.. తీవ్ర అస్వస్థతతో ఇద్దరు మృతి
కాగా.. ఫుట్‌బాల్‌లో అరంగేట్రం చేసిన కొన్నాళ్లలోనే మారడోనా వారసుడిగా మెస్సీ పేరు సంపాదించాడు. తన కెరీర్‌లో ఎన్నో టైటిల్స్, అవార్డులు, రివార్డులు పొందాడు. కానీ, ఇంతవరకు ఫిఫా వరల్డ్‌కప్ మాత్రం అందుకోలేదు. 2014లో వరల్డ్‌కప్ గెలిచే అవకాశం వచ్చినా, చివర్లో అర్జెంటీనా బోల్తా కొట్టేసింది. మరి, ఈసారి అతడు ఫిఫా వరల్డ్‌కప్ టైటిల్‌తో తన కెరీర్‌కు గుడ్‌బై చెప్తాడా? అతని కల నెరవేరుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ!