Lionel Messi: ప్రస్తుత ఫుట్‌బాల్ దిగ్గజాలలో ఒకరైన లియోనెల్ మెస్సీ దాదాపు దశాబ్దం తర్వాత భారత్‌కు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సమాచారం. కానీ, అధికారికంగా మెస్సీ నుంచి అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ఎప్పుడైనా తన సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఈ టూర్‌లో కొల్కతా, అహ్మదాబాద్, ముంబయి, ఢిల్లీ నగరాలు భాగంగా ఉండనున్నాయి. అతని పర్యటన చివర్లో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కూడా…
Argentina Wins Copa America 2024 Cup: కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీ 2024 విజేతగా అర్జెంటీనా నిలిచింది. మియామీలో జరిగిన ఫైనల్‌లో అర్జెంటీనా 1-0తో కొలంబియాను ఓడించింది. నిర్ణీత సమయం (90 నిమిషాలు) ముగిసేసరికి ఇరు జట్లు గోల్స్ చేయలేకపోయాయి. దీంతో 25 నిమిషాల ఎక్స్‌ట్రా టైమ్ కేటాయించారు. ఎక్స్‌ట్రా టైమ్‌లో 15 నిమిషాలు ముగిసినప్పటకీ ఇరు జట్లు గోల్స్ సాధించడంలో విఫలమయ్యాయి. 112వ నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు మార్టినేజ్ గోల్ చేసి జట్టును ఆధిక్యంలో…
Argentina beats Colombia in Copa America 2024 Final: అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ వెక్కివెక్కి ఏడ్చాడు. కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్లో భాగంగా కొలంబియాతో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన మెస్సీ కన్నీరుమున్నీరయ్యారు. కెరీర్‌లో చివరి కోపా అమెరికా ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడిన అతడు డగౌట్‌లో కూర్చొని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్లో లియోనెల్ మెస్సీ…
Another Ballon d’Or trophy to Lionel Messi tally: ఫుట్బాల్ స్టార్ అటగాడు, అర్జెంటీనా ప్లేయర్ లియోనల్ మెస్సీని మరోసారి ‘బాలన్ డి ఓర్’ అవార్డు వరించింది. 2022-23గాను ఉత్తమ ప్రదర్శన చేసినందుకు మెస్సీకి ఈ అవార్డు దక్కింది. గతేడాది నుంచి అత్యుత్తమ ప్రదర్శన చేయడంతో పాటు ఖతర్ వేదికగా జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో తన జట్టును గెలిపించినందుకు ఈ అవార్డు దక్కింది. సోమవారం పారిస్‌లోని థియేటర్ డు చాట్‌లెట్‌లో బాలన్ డి ఓర్ అవార్డును…
Virat Kohli earnings RS 11.45 Crore for a Single Instagram Post: టీమిండియా మాజీ కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి ప్రపంచ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అద్భుత ఆటతో ఎంతో మంది అభిమానులను సంపాదించాడు. ప్రస్తుతం ఏ క్రికెట్ అభిమాని నోటా విన్నా.. కోహ్లీ పేరే వినపడుతుంటుంది. కేవలం క్రికెట్ ఆటలోనే కాదు.. సోషల్ మీడియానూ తాను కింగే అని మరోసారి నిరూపించుకున్నాడు. విరాట్…
ప్రస్తుత ఫుట్ బాల్ తరంలో క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీ ఎవరికి వారే సాటి. వ్యక్తిగతంగా ఎన్నో రికార్డులు అందుకున్న ఈ ఇద్దరు సమానంగానే కనిపంచినా మెస్సీ ఒక మెట్టు ఫైనే ఉంటాడు.
ఆర్జెంటీనా ఫుట్ బాల్ స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీకి చేదు అనుభవం ఎదురైంది. రెస్టారెంట్ నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో ఓకేసారి అభిమానులు మీద పడడంతో ఆయన కాస్త ఉక్కిరిబిక్కిరికి గురయ్యారు.
Lionel Messi's Car Gets Mobbed By Fans In Rosario: ఫుట్ బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ ఎక్కడికి వెళ్లినా అభిమాన సంద్రం ఎదురవుతోంది. తనను కలిసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు గుమిగూడుతున్నారు. ఇటీవల ఖతార్ లో జరిగిన ఫిపా వరల్డ్ కప్-2022లో అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపాడు. ఫైనల్స్ లో ఫ్రాన్స్ ను చిత్తు చేసి 36 ఏళ్ల తరువాత తన దేశానికి వరల్డ్ కప్ అందించారు.
Lionel Messi: అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ ఫిఫా ప్రపంచకప్ సాధించిన ఆనందంలో మునిగి తేలుతున్నాడు. ఈ మేరకు తనకు మద్దతుగా నిలిచిన ఆటగాళ్లకు అపురూప కానుకలు అందజేస్తున్నాడు. తాజాగా మెస్సీ మరోసారి భారత అభిమానుల మనసు గెలుచుకున్నాడు. తన అభిమాని, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూతురు జివా ధోనీకి బహుమతి పంపించాడు. తన జెర్సీపై ఆటోగ్రాఫ్ చేసి జివాకు పంపాడు. ఈ జెర్సీని చూసి జివా ధోని…