FIFA World Cup: క్రికెట్‌లో టీమిండియా ఆటగాడు సచిన్ టెండూల్కర్‌కు ఎంత క్రేజ్ ఉందో.. ఫుట్‌బాల్‌లో అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీకి కూడా అంతే క్రేజ్ ఉంది. వీళ్లిద్దరూ తమ ఆటతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అయితే వీళ్లిద్దరికీ అనేక సారూప్యతలు ఉన్నాయి. క్రికెట్‌లో సచిన్ జెర్సీ నంబర్ 10 అయితే.. ఫుట్‌బాల్‌లో మెస్సీ జెర్సీ నంబర్ కూడా 10. వీళ్ల మధ్య ఇంకా చాలా పోలికలు కనిపిస్తున్నాయి. 2003లో ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి తర్వాత మళ్లీ 8 ఏళ్లకు జరిగిన ప్రపంచకప్‌లో టీమిండియా విజేతగా నిలిచింది. అలాగే 2014లో ప్రపంచకప్ ఫైనల్లో ఓడిన అర్జెంటీనా మళ్లీ 8 తర్వాత జరిగిన ప్రపంచకప్‌లో విశ్వవిజేతగా నిలిచింది. అంతేకాకుండా 2003 ప్రపంచకప్‌లో సచిన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలవగా.. 2014 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లోనూ మెస్సీ గోల్డెన్ బాల్ విన్నర్‌గా నిలిచాడు.
Read Also: Lionel Messi: యూ-టర్న్ తీసుకున్న మెస్సీ.. ఫ్యాన్స్‌కి పండగే!
కాగా ఎట్టకేలకు క్రికెట్‌లో సచిన్ తన ప్రపంచకప్ కల నెరవేర్చుకున్న తరహాలో మెస్సీ కూడా తన జట్టుకు వరల్డ్ కప్ అందించాలన్న కలను నెరవేర్చుకున్నాడు. అయితే 2011 వన్డే ప్రపంచకప్ తర్వాత సచిన్ కొన్నాళ్ల పాటు వన్డేలు ఆడినట్లే ఇప్పుడు మెస్సీ కూడా మరికొంతకాలం ఫుట్‌బాల్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచన తనకు లేదని మెస్సీ చెప్పడంతో అతడి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అర్జెంటీనా ప్రపంచ కప్ గెలిచిన తర్వాత అభిమానులకు మెస్సీ భావోద్వేగ లేఖ రేశాడు. ట్రోఫీ గెలవడం తన కల అన్నాడు. తన ప్రయాణమంతా మద్దతు ఇచ్చిన అభిమానులకు ధన్యవాదాలు చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.