Fifa World Cup 2022: ఫిఫా వరల్డ్‌కప్ విజేతగా అర్జెంటీనా.. నెరవేరిన మెస్సీ కల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Argentina Won Fifa World Cup 2022 On France: ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఫిఫా వరల్డ్‌కప్ 2022 ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్‌పై పెనాల్టీ షూటౌట్లో అర్జెంటీనా గెలుపొందింది. ఈ విజయంతో అర్జెంటీనా మూడోసారి విశ్వవిజేతగా నిలిచింది. గతంలో ఈ జట్టు 1978, 1986లో విజేతగా నిలిచింది. లియోనెల్ మెస్సీ సారథ్యంలో అర్జెంటీనా తొలిసారి కప్పు నెగ్గింది. దీంతో.. తన కెప్టెన్సీలో అర్జెంటీనాకు కప్ తెచ్చిపెట్టాలన్న మెస్సీ కల నెరవేరింది. కాకపోతే.. ఈసారి మెస్సీ గోల్డెన్ బూట్‌ని కోల్పోయాడు. ఈ మ్యాచ్‌కి ముందు వరకు మెస్సీ, ఫ్రాన్స్ ఆటగాడు ఎంబాపే చెరో 5 గోల్స్‌తో సమంగా ఉన్నారు. ఈ మ్యాచ్‌లో మెస్సీ రెండు గోల్స్ చేయగా, ఎంబాపే హ్యాట్రిక్ గోల్స్ చేశాడు. దీంతో ఎంబాపే గోల్డెన్ బూట్ అవార్డ్ సొంతం చేసుకున్నాడు.
Vaishali Kidnap Case: కేసులో మరో పరిణామం.. ఏ2 నిందితుడు అరెస్ట్
Also Read
- Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఖాతాలో చెత్త రికార్డులు.. భారత క్రికెట్లో మరో కొత్త చర్చ..
- Shreyas Iyer: టీమిండియా టీ20 చరిత్రలో రెండో అతిపెద్ద పరాజయం.. రెండూ కెప్టెన్ శ్రేయస్ ఖాతాలోనే..
- Yuvraj Singh: వాళ్లకు అన్యాయం చేయొద్దు.. వైభవ్, అభిషేక్‌లను జట్టులోకి తీసుకోండి..
- Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
మొదట్లో ఈ పోరులో అర్జెంటీనా ఆధిపత్యం సాధించింది. 23వ నిమిషంలో పెనాల్టీని మెస్సి గోల్‌గా మలచగా.. 36వ నిమిషంలో ఏంజెల్ డీ మారియా మరో గోల్ చేశాడు. దీంతో.. తొలి సగభాగం ముగిసేసరికి అర్జెంటీనా 2-0 పాయింట్లతో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ.. రెండో అర్ధభాగంలో మాత్రం ఫ్రాన్స్ పుంజుకుంది. ఆ జట్టు స్టార్ ఆటగాడు ఎంబాపే 80వ నిమిషంలో పెనాల్టీ కిక్ ద్వారా ఒక గోల్, ఆ వెంటనే 81 నిమిషంలో గోల్ చేసి.. స్కోరుని 2-2గా సమం చేశాడు. అప్పుడు ఇరు జట్లు మరో గోల్ కోసం హోరాహోరీగా తలపడ్డాయి కానీ.. నిర్ణీత సమయం ముగిసింది. దీంతో అదనపు సమయం కేటాయించారు. మళ్లీ ఇరు జట్లు బరిలోకి దిగా.. 108 నిమిషాల వద్ద మెస్సీ గోల్ చేశాడు. దాంతో 3-2 తేడాతో అర్జెంటీనా మరోసారి ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే.. మ్యాచ్ ముగియడానికి మరో రెండు నిమిషాలు మాత్రమే ఉన్నప్పుడు, అంటే 118 నిమిషాల వద్ద ఎంబాపే ఊహించని షాకిచ్చాడు. పెనాల్టీని అతడు గోల్‌గా మలిచాడు. దీంతో మళ్లీ స్కోరు 3-3తో సమం అయ్యింది.
Rajma Seeds: రాజ్మా తినండి.. ఆరోగ్యంగా ఉండండి
అదనపు సమయం అయిపోవడం, ఇరు జట్ల స్కోరు సమయంగా ఉండటంతో.. పెనాల్టీ షూటౌట్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఈ రౌండ్లో అర్జెంటీనా వరుసగా నాలుగు బంతుల్ని గోల్స్‌గా మలచగా.. ఫ్రాన్స్ కేవలం రెండు బంతుల్ని గోల్స్‌గా మారింది. దీంతో.. ఈ మ్యాచ్ అర్జెంటీనా వశమైంది. ఎప్పట్నుంచో కంటున్న కల ఈ మ్యాచ్‌తో నెరవేరడంతో.. ప్రపంచవ్యాప్తంగా లియోనెల్ మెస్సీ అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కొందరైతే సంబరాలు కూడా జరుపుకుంటున్నారు.
తాజావార్తలు
-
Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మరో మ్యూజిక్ డైరెక్టర్?
-
Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
-
Ramayana: “నా మనసంతా హైదరాబాద్‌లోనే ఉంది”.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్!
-
Shekar Kammula : “వైలెన్స్ ఉంటేనే సినిమా హిట్ అనుకోవడం భ్రమ.. శేఖర్ కమ్ముల సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!