Argentina vs France, FIFA World Cup 2022 Final: క్రీడాభిమానుల కళ్లన్ని ఇప్పుడు ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పైనే ఉన్నాయి. ఈ మ్యాచ్ కోసం యావత్ ప్రపంచం, ఫుట్ బాల్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఖతార్ లో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు అంతా సిద్దం అయింది. ఆదివారం లుసైన్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అర్జెంటీనా డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ తో తలపడనుంది.
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
వరల్డ్ కప్ కలను అర్జెంటీనా సాధించాలని అనుకుంటోంది. స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ అర్జెంటీనాను ఛాంపియన్ గా నిలబెడతారని ఆ దేశాభిమానులు నమ్ముతున్నారు. అందరి చూపు మెస్సీపైనే ఉన్నాయి. మెస్సీకి ఇదే చివరి వరల్డ్ కప్. మరోవైపు ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు కైలియన్ ఎంజాపేపై ఫ్రాన్స్ భారీగానే ఆశలు పెట్టుకుంది. ఇరు జట్లలో మ్యాచ్ విన్నర్లకు కొదువ లేదు. ఈ రెండు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి.
ఇప్పటి వరకు అర్జెంటీనా-ఫ్రాన్స్ లు 12 సార్లు తలపడ్డాయి. ఈ మ్యాచుల్లో ఫ్రాన్స్ పై అర్జెంటీనా 6 సార్లు గెలుపొందగా.. మూడు మ్యాచులు డ్రాగా ముగిశాయి. ఫ్రాన్స్ 3 సార్లు విజయం సాధించింది. రెండు జట్లు కూడా తమ మూడో ప్రపంచకప్ టైటిట్ ని గెలుచుకోవాలని చూస్తున్నాయి. సెమీఫైనల్స్ లో క్రొయేషియాపై 3-0 తేడాతో గెలిచి అర్జెంటీనా ఫైనల్ కు చేరింది. మరోవైపు టోర్నీలో సత్తా చాటుతున్న మొరాకోపై ఫ్రాన్స్ 2-0 తేడాతో విషయం సాధించి ఫైనల్ కు చేరింది. 1930 ఉరుగ్వేలో జరిగిన ప్రపంచ కప్ లో గ్రూపు దశల్లో అర్జెంటీనా, ఫ్రాన్స్ తొలిసారి తలపడ్డాయి.