భారత్ పర్యటనలో (గోట్ ఇండియా టూర్) భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో సోమవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ మెస్సీకి భారత్, యూఎస్ఏ టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్ టికెట్లను ఐసీసీ చైర్మన్ జై షా అందజేశారు. అంతేకాదు భారత క్రికెట్ జట్టు జెర్సీ, బ్యాట్‌ను కూడా బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, డీడీసీఏ అధ్యక్షుడు…
Lionel Messi: లియోనెల్ మెస్సీ ఇండియా టూర్ నిర్వాహకుడు శతద్రు దత్తాకు బెయిల్ నిరాకరిస్తూ, 14 రోజలు పోలీస్ కస్టడీకి పంపించారు. అర్జెంటీనా సూపర్ స్టార్ మెస్సీ పర్యటన సందర్భంగా శనివారం మధ్యాహ్నం కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్రం గందరగోళం తలెత్తింది. స్టేడియంలో మెస్సీని చూసేందుకు భారీ స్థాయిలో ఆయన అభిమానులు, ప్రేక్షకులు వచ్చారు. అయితే, మెస్సీని వీఐపీలు, రాజకీయ నాయకులు చుట్టుముట్టి ఉండటం, ఆయనను చూసే అవకాశం రాకపోవడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం…
Himanta Sarma: ఫుట్‌బాల్ ఐకాన్ లియోనెల్ మెస్సీ కోల్‌కతా పర్యటన తీవ్ర గందగోళానికి దారి తీసింది. ఈ ఘటనపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ శనివారం, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. మెస్సీ 'GOAT టూర్ 2025' గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ ఈ గందరగోళానికి రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత.
ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్‌కు చేరుకున్నారు. గోట్ ఇండియా టూర్‌లో భాగంగా మెస్సీతో పాటు ఫుట్‌బాలర్లు రోడ్రిగో డి పాల్, లూయిస్ సువారెజ్ కూడా నగరానికి వచ్చారు. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లనున్న మెస్సీ బృందం, సాయంత్రం 7 గంటల వరకు అక్కడే ఉండనుంది. ఈ నేపథ్యంలో ఫలక్‌నుమా ప్యాలెస్ పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఎయిర్‌పోర్ట్ నుంచి ప్యాలెస్ వరకు పటిష్టమైన బందోబస్తు…
కోల్‌కతా పర్యటన ముగించుకుని లియోనల్ మెస్సీ హైదరాబాద్‌కు స్టార్ట్ అయ్యారు. కాగా, సాల్ట్‌లేక్ స్టేడియంలో గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. మెస్సీ.. ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంపై అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Messi Hyderabad Schedule: ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చాయి. షెడ్యూల్ లో భాగంగా డిసెంబర్ 13 (శనివారం)న మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య కోల్‌కతా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. శంషాబాద్ చేరుకున్న వెంటనే మెస్సీ నేరుగా తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లనున్నారు. అక్కడ గంటపాటు అభిమానులతో ప్రత్యేకమైన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మెస్సీతో ఫోటో దిగేందుకు 10 లక్షల…
CM Revanth: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రాజకీయాలలో తిరుగులోని డెసిసిన్స్ తో ప్రతిపక్షాలను ఆడుకుంటున్న నేపధ్యంలో.. ఇప్పుడు ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi) తో నిజమైన ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యారు. అర్జెంటీనా స్టార్ ప్లేయర్ మెస్సీని ఢీకొట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. భారత పర్యటనలో భాగంగా అర్జెంటీనా ఆటగాడు లియోనెల్ మెస్సీ ఈ నెల డిసెంబర్ 13న హైదరాబాద్ నగరానికి విచ్చేయనున్నారు. అదే…
Lionel Messi: అర్జెంటీనా లెజెండరీ ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ డిసెంబర్ 13న హైదరాబాద్‌కు రానుండగా.. ఈ ప్రత్యేక పర్యటన కోసం సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేక సన్నాహాలు చేస్తున్నారు. మెస్సీ భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు వస్తుండగా.. ఆయన సీఎం రేవంత్‌ను ప్రత్యేకంగా కలుసుకునే అవకాశాలు ఉన్నాయని నిర్వాహకులు ఇప్పటికే ప్రకటించారు. మెస్సీ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న అధికారులు హైదరాబాద్ టూర్‌కు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించగా, ఈ పర్యటన పోస్టర్‌ను సీఎం రేవంత్…
Lionel Messi: దిగ్గజ ఫుట్ బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు సందర్భంగా తన సంతకం చేసిన అర్జెంటీనా 2022 FIFA ప్రపంచకప్ జెర్సీని పంపారు. ఈ సంవత్సరం డిసెంబర్ 13 నుండి 15 వరకు మెస్సీ భారతదేశంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, డిసెంబర్ 13న కోల్‌కతాలో అడుగుపెట్టనున్న మెస్సీ, మరుసటి రోజు ముంబైకి బయలుదేరతారు. డిసెంబర్ 15న న్యూఢిల్లీలో తన పర్యటనను ముగించనున్నారు. అక్కడ ఆయన…
Lionel Messi: ప్రస్తుత ఫుట్‌బాల్ దిగ్గజాలలో ఒకరైన లియోనెల్ మెస్సీ దాదాపు దశాబ్దం తర్వాత భారత్‌కు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సమాచారం. కానీ, అధికారికంగా మెస్సీ నుంచి అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ఎప్పుడైనా తన సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఈ టూర్‌లో కొల్కతా, అహ్మదాబాద్, ముంబయి, ఢిల్లీ నగరాలు భాగంగా ఉండనున్నాయి. అతని పర్యటన చివర్లో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కూడా…