టీవీఎస్ మోటార్ కి చెందిన ప్రముఖ బైక్ (TVS Apache) వినియోగదారులలో ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. ఈ క్రమంలో.. కొత్త ఫీచర్లతో టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4V ముందుకొస్తుంది. ఈ బైక్ గోల్డెన్ USD ఫ్రంట్ ఫోర్క్స్‌తో అమర్చారు. దీని ధర రూ. 1.40 లక్షల ఎక్స్-షోరూమ్. టీవీఎస్ అపాచీ RTR 160 4Vలో TVS SmartXonnect TM టెక్నాలజీ ఉంది.
ఇండియాలో వివో (Vivo) Y-సిరీస్ కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. Vivo Y18t అనే కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ IP-54 రేటింగ్‌తో వస్తుంది. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా.. 4GB RAM, 128GB ఇంబిల్ట్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ ప్రత్యేక ఎడిషన్ యాక్సెసరీ ప్యాకేజీని విడుదల చేసింది. సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్ పేరుతో విడుదలైంది. ఈ స్పెషల్ ఎడిషన్ యాక్సెసరీ ప్యాకేజీలు రెండు ఎంపికలలో లభిస్తాయి. స్టాండర్డ్ ప్యాక్ ధర ప్రస్తుత మోడల్ కంటే INR 24,000. ఆప్షనల్ ప్యాక్ ధర INR 51,700.
వన్ ప్లస్ తన తాజా ఫ్లాగ్‌షిప్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో విడుదల చేసింది. వన్ ప్లస్ 13 అనేది కంపెనీ తాజా ఫోన్.. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్ అమర్చారు. ఈ ఫోన్ 24GB RAM+1TB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. వన్ ప్లస్ యొక్క ఈ హ్యాండ్‌సెట్‌లో 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 6.82 అంగుళాల అమోలెడ్ స్క్రీన్‌తో వస్తుంది.
పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని దిగ్గజ కంపెనీలన్నీ ఆఫర్స్, డిస్కౌంట్స్ ప్రకటిస్తుంటే.. ట్రయంఫ్ కంపెనీ మాత్రం రూ. 19.39 లక్షల ఖరీదైన '2025 టైగర్ 1200' బైక్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ బైక్ నాలుగు వేరియంట్లలో ముందుకొచ్చింది. అంతేకాకుండా.. కొత్త ఇంజిన్, మెరుగైన రైడ్ సౌకర్యం, ఎర్గోనామిక్స్, మరిన్ని ఎలక్ట్రానిక్ టూల్స్ ఉన్నాయి.
టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియన్ మార్కెట్లో గ్లాంజా ఫెస్టివల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. అక్టోబర్ 31 వరకు అన్ని టయోటా డీలర్‌షిప్‌లలో అన్ని వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. గ్లాంజా ఫెస్టివల్ ఎడిషన్ డీలర్-ఫిట్టెడ్ టయోటా జెన్యూన్ యాక్సెసరీస్ (TGA) ప్యాకేజీతో వస్తుంది. ధర రూ. 6.86-10 లక్షలు (ఎక్స్ షోరూం ఢిల్లీ).
శాంసంగ్ A-సిరీస్ తాజా స్మార్ట్‌ఫోన్‌ను ఈ రోజు ఇండియాలో లాంచ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఏ 16 5జీ (Samsung Galaxy A16 5G)తో గత వారం యూరప్‌లో ప్రారంభమైంది. తాజాగా.. ఇండియాలో ఈ స్మార్ట్ ఫోన్ విడుదల అయింది. ఈ ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ Super AMOLED డిస్‌ప్లే, 50MP ప్రైమరీ కెమెరా, 5000mAh బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి ఉంది.
మహీంద్రా అండ్ మహీంద్రా స్కార్పియో క్లాసిక్ SUV కోసం కొత్త బాస్ ఎడిషన్‌ను పరిచయం చేసింది. అనేక కాస్మెటిక్ మార్పులు, కొత్త ఫీచర్లతో వస్తుంది. డీలర్షిప్ స్థాయిలో యాక్సెసరీస్ ద్వారా ఇన్స్టాల్ చేస్తున్నారు. మహీంద్రా స్కార్పియో క్లాసిక్ బాస్ ఎడిషన్ పండుగ సీజన్లో మాత్రమే అమ్మకానికి ఉంటుందని తెలుస్తోంది.
ఇండియాలో ఎలిస్టా (Elista) గూగుల్ టీవీ(Google TV)ని ప్రారంభించింది. తాజాగా.. 85 అంగుళాల(inches) సైజు టీవీని విడుదల చేసింది. ఇంతకు ముందు.. 32 నుండి 65 అంగుళాలు అందుబాటులో ఉన్నాయి. ఈ 85 ఇంచెస్ టీవీ ధర రూ.1.60 లక్షలు. గూగుల్ టీవీ ఫీచర్ల గురించి చెప్పాలంటే.. లేస్ బెజెల్ డిజైన్ వస్తుంది.
హానర్ కొత్త ట్యాబ్‌ను రిలీజ్ చేసేందుకు రెడీ అయింది. హానర్ టాబ్లెట్ జీటీ ప్రో (Honor Tablet GT Pro) వచ్చే వారం చైనాలో విడుదల కానుంది. అందుకు సంబంధించి కంపెనీ హానర్ టాబ్లెట్ జీటీ ప్రో డిజైన్, కలర్ ఆప్షన్స్, కొన్ని కీలక స్పెసిఫికేషన్లను వెల్లడించింది. ఈ ట్యాబ్ ను హానర్ X60 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌తో ప్రారంభించనున్నారు. ట్యాబ్‌లో బేస్, ప్రో వేరియంట్లు ఉండే అవకాశం ఉంది. టాబ్లెట్ జీటీ ప్రో 12.3-అంగుళాల డిస్ప్లేను కలిగి…