TVS Apache RTR 160 4V: కొత్త ఫీచర్లతో టీవీఎస్ అపాచీ రిలీజ్.. ధర ఎంతంటే..?
- కొత్త ఫీచర్లతో టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4V
- ఈ బైక్ ధర రూ. 1.40 లక్షల ఎక్స్-షోరూమ్
- ఈ బైకులో TVS SmartXonnect TM టెక్నాలజీ ఉంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీవీఎస్ మోటార్ కి చెందిన ప్రముఖ బైక్ (TVS Apache) వినియోగదారులలో ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. ఈ క్రమంలో.. కొత్త ఫీచర్లతో టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4V ముందుకొస్తుంది. ఈ బైక్ గోల్డెన్ USD ఫ్రంట్ ఫోర్క్స్‌తో అమర్చారు. దీని ధర రూ. 1.40 లక్షల ఎక్స్-షోరూమ్. టీవీఎస్ అపాచీ RTR 160 4Vలో TVS SmartXonnect TM టెక్నాలజీ ఉంది. అంతేకాకుండా.. బ్లూటూత్ కనెక్టివిటీని అలాగే టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్, SMS వార్నింగ్, వాయిస్ సహాయాన్ని అందిస్తుంది. ఈ బైకులో గ్లైడ్ త్రూ టెక్నాలజీ (GTT) కూడా ఉంది.
Read Also: Raja Singh: రోడ్డుపై నమాజ్ చేస్తే, హనుమాన్ చాలీసా.. రాజా సింగ్ సంచలనం..
Also Read
- Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
- Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
- Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
- Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
బైక్ కలర్స్:
టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 1604V మూడు వేర్వేరు కలర్లలో అందుబాటులో ఉంటుంది. అందులో గ్రానైట్ గ్రే, మ్యాట్ బ్లాక్, పెర్ల్ వైట్ వంటి రంగులు ఉన్నాయి. ఇంతకు ముందు లైట్నింగ్ బ్లూ ఉండేది. ఈ బైక్ స్పోర్టీ, రేస్-ప్రేరేపిత గ్రాఫిక్స్, గోల్డెన్-ఫినిష్ USD ఫోర్క్స్, రెడ్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది.
ఇంజిన్, ట్రాన్స్‌మిషన్:
టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4V బైక్ 160 cc సింగిల్-సిలిండర్ ఎయిర్, ఆయిల్-కూల్డ్ ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ 8,000 rpm వద్ద 17.3 bhp శక్తిని, 6,500 rpm వద్ద 14.8 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ బైక్ గరిష్టంగా గంటకు 114 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. రైడ్ మోడ్‌ల గురించి మాట్లాడుతూ.. అపాచీ ఆర్టీఆర్ 160 4Vలో స్పోర్ట్, అర్బన్, రెయిన్ సహా మూడు రైడ్ మోడ్‌లు ఉన్నాయి.
సస్పెన్షన్, బ్రేకింగ్:
ఈ బైకుకు 37mm USD ఫ్రంట్ సస్పెన్షన్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపున మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. ఇది డ్యూయల్-ఛానల్ ABS, 240 mm వెనుక డిస్క్ బ్రేకింగ్ కలిగి ఉంది.
ధర:
అపాచీ ఆర్టీఆర్ 160 4V ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.40 లక్షలు. ఈ బైక్ బజాజ్ పల్సర్ N160, హీరో ఎక్స్ ట్రీమ్ 160R 4V వంటి బైకులకు పోటీగా నిలుస్తుంది.
తాజావార్తలు
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
-
Supreme Court: “ఇక బండి సీజ్”.. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
-
Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?