తెలంగాణ రాష్ట్రంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలను తీసుకొస్తుంది. ఈ క్రమంలో మంత్రి సీతక్క రేపు సంచార చేపల విక్రయ వాహనాలను ప్రారంభించనున్నారు. ప్రజా భవన్ వేదికగా ఉదయం 9.30 గంటలకు మంత్రి వాహనాలను ప్రారంభించనున్నారు.
JSW తన వాహనాలను MG మోటార్ ఇండియా సెలెక్ట్ ద్వారా లగ్జరీ విభాగంలోకి తీసుకురాబోతోంది. కంపెనీ MG సైబర్‌స్టర్‌ను త్వరలో ప్రారంభించనుంది. సైబర్‌స్టర్ 2-డోర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు వివరాలు భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ముందుకు రానున్నాయి.
ఇటీవలే కియా సిరోస్ (Kia Syros EV) ఇండియాకు వచ్చేసింది. ఈ కారు పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లలో లాంచ్ చేశారు. ఇందులో చాలా గొప్ప ఫీచర్లు ఉన్నాయి. ఈ క్రమంలో.. ఆల్-ఎలక్ట్రిక్ వేరియంట్ కియా సిరోస్ ఈవీ కూడా తర్వలో లాంచ్ కానుంది. 2026 నాటికి ఇండియాలో ప్రారంభించనున్నారు.
వివో (Vivo) 'Y' సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. చైనాలో లాంచ్ చేసిన ఈ ఫోన్‌కు కంపెనీ 'Vivo Y300' అని పేరు పెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్‌ను చైనా కంటే ముందే భారత్‌లో ప్రవేశపెట్టిందని చెబుతున్నారు. ఈ ఆండ్రాయిడ్ ఫోన్ 120Hz ఫ్లాట్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే.. డైమండ్ షీల్డ్ గ్లాస్‌తో వస్తుంది.
2020లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండియాలో రిలీజైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఈ స్కూటర్ అమ్మకాలు తక్కువగా ఉండగా.. ఆ తర్వాత కొత్త మోడల్స్, ధర తగ్గింపులు కారణంగా సేల్స్ పెరిగాయి. దీంతో.. ఈ స్కూటర్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మూడవ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా నిలిచింది. కాగా.. కంపెనీ మరో మోడల్‌ను విడుదల చేయబోతోంది. ఈ స్కూటర్ 2024 డిసెంబర్ 20న భారత మార్కెట్లో లాంచ్ కానుంది.
గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ కస్టమర్లలో ఎలక్ట్రిక్ కార్ల (EV) డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో.. ప్రముఖ కార్ల తయారీ సంస్థ JSW MG మోటార్ ఇండియా.. కొత్త ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నద్ధం అవుతుంది. 2025లో ఈ కారు విడుదల కానుంది. ఈ కారు లాంచ్‌కు సంబంధించి.. కంపెనీ సమాచారం ఇచ్చింది. 2025 జనవరిలో ఇండియాలో MG సైబర్‌స్టర్‌ను ప్రారంభించనుంది.
హైపర్ మార్ట్ వాల్యూజోన్.. మరోసారి చరిత్ర సృష్టించేందుకు నాచారంలో సిద్ధమైంది. హైపర్ మార్ట్ బ్రాండ్ అంబాసిడర్‌గా హైపర్ మార్ట్స్‌తో అనుబంధం ఉన్న ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి బాలకృష్ణ ఈరోజు (నవంబర్ 28)న ప్రారంభించారు.
రియల్ మీ తన C-సిరీస్ యొక్క కొత్త బడ్జెట్ 4G స్మార్ట్‌ఫోన్‌ను వియత్నాంలో లాంచ్ చేసింది. కంపెనీ (Realme C75) అనే కొత్త ఫోన్ రిలీజ్ చేసింది. ఈ ఫోన్ 6.72 అంగుళాల ఫుల్ హెచ్డీ+ 90Hz స్క్రీన్, MediaTek Helio G92 ప్రాసెసర్, 8GB RAM, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంది.
2024 డిసెంబర్ 4న అమేజ్ 2024ని హోండా విడుదల చేయనుంది. అయితే.. ఈ కారు లాంచ్ కాకముందే.. బుకింగ్ అనధికారికంగా ప్రారంభమయ్యాయి. మీడియా కథనాల ప్రకారం.. ఈ కార్ బుకింగ్‌లను కొంతమంది డీలర్లు తీసుకుంటున్నారు. అయితే దీనిపై కంపెనీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
హోండా కంపెనీ భారత మార్కెట్లో అనేక విభాగాల్లో స్కూటర్లు, బైక్‌లను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే... తాజాగా టూ-వీలర్ ICE విభాగంలో కూడా అందిస్తుంది. అయితే కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రేపు (27 నవంబర్ 2024)న విడుదల చేయనుంది.