Honda Amaze: బుకింగ్స్ ప్రారంభం.. డిసెంబర్ 4న అదిరిపోయే ఫీచర్లతో లాంచ్
- 2024 డిసెంబర్ 4న అమేజ్ 2024 లాంచ్
- ఈ కారు లాంచ్ కాకముందే బుకింగ్స్ అనధికారికంగా ప్రారంభం
- ఈ కారులో డబుల్ బీమ్ ఎల్ఈడీ లైట్లు, ఫ్రంట్ గ్రిల్, బంపర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024 డిసెంబర్ 4న అమేజ్ 2024ని హోండా విడుదల చేయనుంది. అయితే.. ఈ కారు లాంచ్ కాకముందే.. బుకింగ్ అనధికారికంగా ప్రారంభమయ్యాయి. మీడియా కథనాల ప్రకారం.. ఈ కార్ బుకింగ్‌లను కొంతమంది డీలర్లు తీసుకుంటున్నారు. అయితే దీనిపై కంపెనీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ కారుకు సంబంధించి ఫీచర్లు, ధర, డిజైన్ వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Read Also: Pushpa -2 : దేవిశ్రీ ప్రసాద్ వివాదంపై మైత్రీ నిర్మాతల రియాక్షన్
Also Read
- 32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
- Ather Konarc S: ఫుల్ ఛార్జ్‌తో 161KM రేంజ్.. 3.5kWh బ్యాటరీ, రోజువారీ ప్రయాణాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్
- రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
- Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
ప్రత్యేకత ఏమిటి..?
హోండా అమేజ్ 2024లో డబుల్ బీమ్ ఎల్ఈడీ లైట్లతో ముందుకొస్తుంది. అంతేకాకుండా.. దీని ఫ్రంట్ గ్రిల్, బంపర్ కూడా మారాయి. ఈ వాహనం యొక్క సైడ్ వ్యూ మిర్రర్ డిజైన్ కూడా చాలా షార్ప్‌గా డిజైన్ చేశారు. అంతేకాకుండా.. కొత్త డ్యాష్‌బోర్డ్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇస్తున్నారు. ఈ కారులో డిజిటల్ ఏసీ ప్యానెల్ అందిస్తున్నారు. సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంటుంది. క్రూయిజ్ కంట్రోల్‌తో సహా అనేక ఇతర ఫీచర్‌లను నియంత్రించడానికి స్టీరింగ్‌లో స్విచ్‌లు ఉంటాయి. లోపలి భాగంలో నలుపు, లేత గోధుమరంగు రంగులను ఉపయోగించారు. ఈ కారు మాన్యువల్‌తో పాటు, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో వస్తుంది. విశేషమేమిటంటే.. పెట్రోల్‌తో పాటు సీఎన్‌జీ టెక్నాలజీతో ఈ కారు మార్కెట్లోకి వస్తోంది.
భద్రత ఎలా ఉంటుంది..?
న్యూ మోడల్ హోండా అమేజ్ 2024లో కంపెనీ అనేక అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లను అందిస్తుంది. అంతేకాకుండా.. అనేక సేఫ్టీ ఫీచర్లను స్టాండర్డ్‌గా కంపెనీ అందించనుంది. దీనితో పాటు, ADAS కూడా ఇందులో అందించవచ్చు. ఈ కారులో ADAS అందిస్తే.. దాని సెగ్మెంట్‌లో ఈ భద్రతా ఫీచర్ అందించబడే మొదటి కారు ఇదే అవుతుంది. ADAS వంటి భద్రతా ఫీచర్ల గురించిన సమాచారం అందుబాటులో ఉన్న కొన్ని ఫోటోలు ఇటీవల విడుదలయ్యాయి.
ధర:
ఈ కారు ధర లాంచ్ సమయంలో మాత్రమే తెలియనుంది. ఈ కారు ధరను ప్రస్తుత వెర్షన్ ఎక్స్-షోరూమ్ ధర చుట్టూ ఉంచవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం.. మార్కెట్లో లభ్యమవుతున్న సెకండ్ జనరేషన్ హోండా అమేజ్ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.19 లక్షల నుండి ప్రారంభమవుతుంది. దాని టాప్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.9.13 లక్షలు.
ఈ కారుకు పోటీ:
హోండా అమేజ్ 2024 భారత మార్కెట్లో కాంపాక్ట్ సెడాన్ కార్ సెగ్మెంట్‌లో విడుదల కానుంది. మారుతి డిజైర్ 2024, టాటా టిగోర్, హ్యుందాయ్ ఆరా వంటి కార్లు ఈ విభాగంలో అందిస్తున్నారు. ఈ క్రమంలో హోండా కొత్త అమేజ్ 2024 ఈ మూడు కార్లతో పోటీపడుతుంది.
తాజావార్తలు
-
US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: ఆ రెండు డెడ్లీ అండ్ రేర్ కాంబో.. అందుకే వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోతున్నాడు!
-
Movie Ticket Rates Hikes : పెంచిన సినిమా టిక్కెట్ రేట్లపై ఫైర్ అవుతున్న కామన్ ఆడియన్
-
Prabhas ‘Fauzi : ‘ఫౌజీ’ పోస్ట్ పోన్.. మాకు అలవాటు అయిపోందిలే అంటున్న ఫ్యాన్స్
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!