జూన్ 24న దాదాపు పది సినిమాలు విడుదల కాబోతున్నాయి. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాశ్ హీరోగా నటించిన ‘చోర్ బజార్’ మూవీని కూడా అదే రోజు విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ఈరోజు ప్రకటించారు. అయితే ఇప్పటికే జూన్ 24న పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ నటించిన ‘ఒక పథకం ప్రకారం’ మూవీ విడుదల కావాల్సి ఉంది. మొన్నటి వరకూ ఆ సినిమా పబ్లిసిటీని కూడా బాగా చేశారు. తాజా సమాచారం ప్రకారం ‘ఒక పథకం…
మలయాళీ భామ సాయి పల్లవి టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. నటనకు అవకాశం ఉన్న పాత్ర ఉంటే తప్పకుండా దర్శకనిర్మాతలు సాయిపల్లవినే అప్రోచ్ అవుతుంటారు. దక్షిణాదిన సినిమాలలో స్కిన్ షో చేయకుండా సూపర్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఏకైక తార సాయిపల్లవే అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో ఆమెకు వచ్చిన స్టార్‌డమ్ అంతా ఆమె పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ కారణంగానే వచ్చిందన్నమాట. ఇక సాయి పల్లవి స్కిన్ షోకి దూరంగా ఉండటానికి కారణం…
తెలుగు ఇండియన్ ఐడల్ చివరి దశకు చేరింది. 15 వారాల పాటు సాగిన ఈ సంగీత ప్రయాణం చివరి ఘట్టానికి చేరుకుంది. ఈ నెల 17న తెలుగు ఇండియన్ ఐడల్ తొలి విజేత ఎవరో తెలియనుంది. ఫైనలిస్ట్ లుగా నిలిచిన ఐదుగురిలో విజేత ఎవరన్నది మెగాస్టార్ చిరంజీవి ప్రకటించనున్నారు. ఈ ఫైనల్ ఎపిసోడ్ చిత్రీకరణలో పాల్గొని గాయనీ గాయకులను ఉత్తేజపరుస్తూ వారు పాడిన పాటలకు స్టెప్స్ వేసి మరీ పులకింపచేశారు చిరంజీవి. గాయని ప్రణతి వాళ్ళ మదర్…
ప్రముఖ గాయకుడు జస్టిన్ బీబర్ ముఖ పక్షవాతంతో బాధపడుతున్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఎకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పోస్ట్ చేశారు.ఈ వీడియో కొన్ని గంటల్లోనే 14 మిలియన్ల వ్యూస్ రాబట్టడం విశేషం. 3 నిమిషాల వీడియోలో తన పరిస్థితిని సవివరంగా తెలియచేశాడు జస్టిన్. ఈ వ్యాధి కారణంగా గ్రామీ విజేత ముఖం కుడి వైపు పక్షవాతానికి గురయింది. జస్టిన్ తన వీడియోలో పాక్షిక పక్షవాతం కారణంగా ముఖం కుడి సగ భాగాన్ని ఎలా కదలించగలడో…
“నవ్వు నారాయణుడు ఇచ్చిన వరం” అన్నారు పెద్దలు. ఆ మాటనే పట్టుకొని సాగారు ఇ.వి.వి. సత్యనారాయణ. నవ్వడంలోని యోగాన్ని, నవ్వించడంలోని భోగాన్నీ గురువు జంధ్యాల దగ్గర ఒడిసిపట్టి, ఆపై కితకితలు పెట్టి ‘జంబలకిడిపంబ’ పలికించారు ఇ.వి.వి. ఆయన పూయించిన నవ్వుల పువ్వుల గుబాళింపు ఈ నాటికీ ఆనందం పంచుతోంది. ఆహ్లాదం పెంచుతోంది. ఇ.వి.వి. సత్యనారాయణ 1956 జూన్ 10న పశ్చిమ గోదావరి జిల్లా కోరుమామిడి గ్రామంలో జన్మించారు. చదువుకొనే రోజుల నుంచీ సినిమాలు చూస్తూ, వాటిలోని తప్పొప్పులను…
ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అయ్యే అనేక వెబ్ సిరీస్ LGBTQ కు జై కొడుతున్నాయి. లెస్సియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్, క్వశ్చనింగ్- అంటూ ఈ తరహా కేరెక్టర్స్ తోనే పలు పాత్రలు రూపొంది, వెబ్ సిరీస్ హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘ట్వైలైట్’ బ్యూటీ క్రిస్టెన్ స్టివార్ట్ ‘క్వీర్ పారానార్మల్ రియాలిటీ సిరీస్’లో పాలు పంచుకొనేవారి కోసం ఆడిషన్స్ మొదలెట్టింది. ఇప్పటి దాకా ఎవరూ చూడనటువంటి ‘ఘోస్ట్ హంటింగ్ షో’ను…
ఏ పరిశ్రమ అయినా పురోగమనంలో ఉన్నప్పుడు ప్రాథమిక సూత్రాలు సైతం పనికిరాకుండా అనూహ్య విజయాలు దరి చేరుతూ ఉంటాయి. అదే తిరోగమనం ఎదురైనప్పుడే విశ్లేషణలు అవసరమవుతూ ఉంటాయి. ప్రస్తుతం ‘బాలీవుడ్’ కు అలాంటి విశ్లేషణలు ఎంతయినా అవసరం. స్టార్ హీరోస్ నటించిన భారీ చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోతున్నాయి. ఈ పరిస్థితికి దక్షిణాది సినిమా పుంజుకోవడమే కారణమని కొందరు అంటున్నారు. కానీ, అది నిజం కాదు. ఉత్తర, దక్షిణ అన్న తేడాలు కళలకు ఎప్పుడూ…
డింపుల్ కపాడియా… ఈ పేరు ఆ రోజుల్లో ఎంతోమంది రసికాగ్రేసరులకు నిద్రలేని రాత్రులు మిగిల్చింది. అప్పటి డింపుల్ అందాలను తలచుకొని ఈ నాటికీ పరవశించిపోయేవారెందరో ఉన్నారు. అందానికే ఓ ఆలోచన వచ్చి డింపుల్ కపాడియాలా పుట్టిందనీ అనే అభిమానులు లేకపోలేదు. జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా వెలుగొందారు డింపుల్ కపాడియా. డింపుల్ కపాడియా 1957 జూన్ 8న ముంబైలో జన్మించింది. ఆమె అసలు పేరు అమీనా. ఆగా ఖాన్ వంశానికి చెందినవారు. ముంబై శాంటాక్రజ్ లోని సెయింట్…
గతంలో సవత్సరానికో సినిమాతో అలరించిన యంగ్ హీరో నిఖిల్.. తెరపై కనిపించి దాదాపు మూడేళ్లు కావొస్తుంది. చివరగా అర్జున్ సురవరం సినిమాలో కనిపించిన నిఖిల్.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రాబోతున్నాడు. ప్రస్తుతం సుకుమార్ ప్రొడక్షన్లో.. ఆయన శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్ దర్శతక్వంలో ’18 పేజెస్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ఎప్పుడో పూర్తయినా.. విడుదలకు మాత్రం నోచుకోవడం లేదు. సుకుమార్ కథను అందించిన సినిమా కావడంతో.. ఈ మూవీ పై భారీగానే…