ఆరడగుల అందం, పసిమిఛాయ, చూడగానే ఆకట్టుకొనే రూపం, విలక్షణమైన చిరునవ్వు అరవింద్ స్వామి సొంతం. తెరపై అరవింద్ స్వామిని చూడగానే ఎందరో ముద్దుగుమ్మలు మనసు పారేసుకున్నారు. శ్రీదేవి లాంటి అందగత్తె సైతం ఈ అరవిందుని చేయి అందుకోవాలని ఒకానొక సమయంలో ఉవ్విళ్ళూరింది. దీనిని బట్టే అప్పట్లో అరవింద స్వామి క్రేజ్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం తన వయసుకు తగ్గ పాత్రలు పోషిస్తూ సాగుతున్నారు అరవింద్ స్వామి. అరవింద్ స్వామి 1970 జూన్ 18న చెన్నైలో…
అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన తారలుగా రూపొందిన చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అచ్యుత రామారావు పి, రవితేజ మన్యం సంయుక్తంగా దీన్ని నిర్మించారు. ఈ చిత్రంతో ప్రముఖ ఛాయాగ్రాహకుడు ‘గరుడవేగ’ అంజి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జూన్ 24న విడుదల కావాల్సిన ఈ సినిమా ఓ వారం ఆలస్యంగా జూలై 1న రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన పోస్టర్ ను శుక్రవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. విశేషం ఏమంటే… నటుడు శ్రీరామ్ కీలక…
నిర్మాత ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. ‘డర్టీ హరి’తో హిట్ కొట్టిన ఎం.ఎస్.రాజు తాజా చిత్రమిది. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్, రజనీకాంత్.ఎస్ నిర్మించారు. సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా మెహర్ చాహల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జూన్ 24న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మెహర్ చాహల్ మీడియాతో ముచ్చటించింది. ‘మాది అస్సాం. మా నాన్న టీ ప్లాంటేషన్స్‌లో వర్క్ చేసేవారు.…
అటు తమిళం ఇటు తెలుగులో హాట్ టాపిక్ లోకేశ్ కనకరాజ్. కమల్ హాసన్ తో లోకేష్ తీసిన ‘విక్రమ్’ సినిమా అఖండ విజయం సాధించింది. కమల్ కున్ను అప్పులన్నింటినీ తీర్చిన సినిమాగా ‘విక్రమ్’ నిలిచింది. సందీప్ కిషన్ తో తీసిన ‘మానగరం’, ఆ తర్వాత కార్తీతో ‘ఖైదీ’, విజయ్ తో ‘మాస్టర్’ సినిమాలు సైతం లోకేష్ ప్రతిభకు పట్టం కట్టాయి. ఇప్పుడు ‘విక్రమ్’తో అపజయం ఎరుగని దర్శకుల ఖాతాలో చేరిపోయాడు లోకేష్. దాంతో టాలీవుడ్ లో లోకేష్…
యువతను కిర్రెక్కించేలా బాణీలు కట్టి, భలేగా హిట్లు పట్టారు చక్రి. అప్పట్లో చక్రి స్వరకల్పనతో సక్సెస్ రూటులో సాగాయి పలు చిత్రాలు. పిన్నవయసులోనే కన్నుమూసిన చక్రి సంగీత దర్శకునిగా మాత్రం భలే పేరు సంపాదించారు. అలాగే పలు దానధర్మాలూ చేసి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. చక్రి సంగీతంతో సంబరాలు చేసుకున్న అభిమానులు ఇప్పటికీ ఆయన స్వరవిన్యాసాలు తలచుకుంటూ, ఆయన జయంతిన ఏదో ఒక సేవాకార్యక్రమం నిర్వహిస్తూనే ఉండడం విశేషం! గిల్లా చక్రధర్ 1974 జూన్ 15న తెలంగాణలోని…
ముప్పై తొమ్మిదేళ్ళు పూర్తి చేసుకొని నలభయ్యో ఏట అడుగుపెట్టినా ఇంకా లవర్ బోయ్ ఇమేజ్ తోనే సాగుతున్నాడు నితిన్. జయాపజయాలకు అతీతంగా నితిన్ పయనం సాగింది. యువతలో నితిన్ కు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నితిన్ ను పరాజయాలు పలకరించినప్పుడు, తప్పకుండా ఈ సారి మా హీరో సక్సెస్ సాధిస్తాడు అనే నమ్మకంతో ఉండేవారు అభిమానులు. అందుకు తగ్గట్టుగానే అనూహ్యంగా నితిన్ ను విజయం వరించేది. త్వరలో ‘మాచర్ల నియోజకవర్గం’ అనే సినిమాతో జనం ముందుకు…
తెలుగు చిత్రసీమలో యాభైకి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన తొలి దర్శకుడిగా చరిత్ర సృష్టించారు వి.మధుసూదనరావు. ఆయన పూర్తి పేరు వీరమాచినేని మధుసూదనరావు అయినా, అందరూ ‘విక్టరీ’ మధుసూదనరావు అనే పిలిచేవారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన పలు చిత్రాలు విజయకేతనం ఎగురవేయడంతో ‘విక్టరీ’ ఇంటిపేరుగా మారింది. ఇక ‘రీమేక్ కింగ్’ గానూ ఆయన అలరించారు. మధుసూదనరావు దర్శకత్వంలో రూపొందిన పలు రీమేక్ మూవీస్ తెలుగువారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. మధుసూదనరావు 1923 జూన్ 14న కృష్ణాజిల్లాలో జన్మించారు. చదువుకొనే…