Sai Pallavi : ఆ డాన్స్ తోనే సాయి పల్లవి స్కిన్ షో కి నో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళీ భామ సాయి పల్లవి టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. నటనకు అవకాశం ఉన్న పాత్ర ఉంటే తప్పకుండా దర్శకనిర్మాతలు సాయిపల్లవినే అప్రోచ్ అవుతుంటారు. దక్షిణాదిన సినిమాలలో స్కిన్ షో చేయకుండా సూపర్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఏకైక తార సాయిపల్లవే అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో ఆమెకు వచ్చిన స్టార్‌డమ్ అంతా ఆమె పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ కారణంగానే వచ్చిందన్నమాట. ఇక సాయి పల్లవి స్కిన్ షోకి దూరంగా ఉండటానికి కారణం ఏమిటన్నది ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియచేసింది. సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సాయిపల్లవి తండ్రి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. ఆమెకు ఓ చెల్లెలు. చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన తర్వాత జరిగిన ఓ సంఘటన సాయిపల్లవిని ఎక్స్ పోజింగ్ కి దూరంగా ఉంచిందట. జార్జియాలో విద్యాభ్యాసం చేసిన సాయిపల్లవి అక్కడ టాంగో డ్యాన్స్ నేర్చుకుంది. అయితే ఆ డాన్స్ చేసేటప్పుడు ప్రత్యేకమైన దుస్తులు ధరించాలి. పేరంట్స్ అనుమతితో ఆ నృత్యాన్ని నేర్చుకుంది కూడా. అంతే కాదు అప్పట్లో టాంగో ఫిల్మ్ ఫెస్టివల్ లో ఆకాకిఅవలైనితో కలసి ప్రదర్శన కూడా ఇచ్చింది.
Also Read
- Nani: "18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు" ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
- Jailer 2: రజినీ 'జైలర్ 2' బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
- Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
- Venkatesh: "20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది"
ఆ తర్వాత ‘ప్రేమమ్’ చిత్రంలో నటించే అవకాశం రావటం ఆ సినిమా విడుదలై సూపర్ హిట్ అవటం జరిగిపోయాయి. కానీ తను స్టార్ అయిన తర్వాత సాయిపల్లవి చేసిన టాంగో డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఆ వీడియోపై నెటిజన్లు చేసిన ఘాటు కామెంట్స్ తనకు ఎంతో అసౌకర్యాన్ని కలిగించాయట. అంతే అప్పటి కప్పుడు సినిమాల్లో ఎక్స్ పోజింగ్ అనిపించే కాస్ట్యూమ్స్ ని ధరించకూడదనే నిర్ణయం తీసుకుందట. సాయి పల్లవి గ్లామర్ ప్రదర్శనకు దూరంగా ఉండటానికి కారణం ఇదేనట. ప్రస్తుతం సాయిపల్లవి నటించిన ‘విరాట పర్వం’ ఈ నెల 17న విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత తమిళంలో ఓ సినిమా చేస్తున్నట్లు చెబుతోంది. తనకు నచ్చిన సబ్జెక్ట్స్ అయితేనే సినిమాలు చేస్తానని కరాఖండిగా చెబుతోంది సాయిపల్లవి
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?