చిత్రవిచిత్రాలకు నెలవు చిత్రసీమ. ఇక్కడ ఒకటి కావాలని వచ్చి, మరోటి అవుతూ ఉంటారు. ఒకలా ఓ సారి వెలుగులు విరజిమ్మి, మరోలా ఇంకోసారి తళుక్కుమనే వారికీ ఇక్కడ కొదువే లేదు. అలా వెలుగొందుతున్నవారిలో ఓ నాటి నటి, ఈ నాటి మేటి డబ్బింగ్ ఆర్టిస్ట్ సరిత గురించి తప్పకుండా చెప్పుకోవాలి. సరిత పలుకుతో ఈ నాటికీ మురిపిస్తున్న చిత్రాలెన్నో వస్తున్నాయి. తాజాగా వచ్చిన ‘సర్కారువారి పాట’లోనూ నదియాకు సరిత గళవిన్యాసాలు అలరించాయి. సరిత పదహారణాల తెలుగమ్మాయి. ఆమె…
ప్రస్తుతం ఉన్న ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో అతి తక్కువ మొత్తానికి వినోదాన్ని అందిస్తున్న సంస్థ ఆహా! కేవలం 299 రూపాయలతో యేడాది పాటు కంటెంట్ ను చూసే సౌకర్యం ఉంది. అయితే వ్యూవర్స్ ను మరింతగా పెంచుకునేందుకు తాజాగా ఆహా ఓ కొత్త ఆకర్షణీయమైన ప్లాన్ తో వచ్చింది. మూడు నెలల పాటు నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ ను కేవలం రూ. 99 రూపాయలతో పొందే వెసులుబాటు కల్పిస్తోంది. ఈ మొత్తంతో…
తెరపై ప్రతినాయకునిగా భయపెట్టినా, నిజజీవితంలో ఎంతో సౌమ్యులు, పది మందికి మేలు చేయాలని తపించేవారు డాక్టర్ ఎమ్.ప్రభాకర్ రెడ్డి. ఆ తపనతోనే తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్ కు తరలి వస్తున్న సమయంలో సినీకార్మికుల పక్షాన నిలచి ముందు వారికి నివాసస్థలాలు ఇవ్వాలని పట్టు బట్టి మరీ ప్రభుత్వాన్ని ఒప్పించారు. ఆయన కృషి ఫలితంగానే హైదరాబాద్ లో నేడు అతి ఖరీదైన ప్రాంతంగా నెలకొన్న మణికొండలో సినీకార్మికుల గృహసముదాయం వెలసింది. దానికి ‘డాక్టర్ ఎమ్.ప్రభాకర్ రెడ్డి చలనచిత్ర…
ఇంద్రగంటి శ్రీకాంతశర్మ సాహితీ పురస్కారం 2022 సంవత్సరానికి ప్రముఖ కవి శ్రీ దర్భశయనం శ్రీనివాసాచార్య గారికి ఇవ్వాలని పురస్కార కమిటీ నిర్ణయించింది. ఇంద్రగంటి జానకీబాల, శీలా సుభద్రాదేవి, మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ కమిటీలో సభ్యులు. త్వరలో పురస్కార ప్రదాన కార్యక్రమ వివరాలు తెలియజేయనున్నారు. ‘శ్రీ శ్రీనివాసాచార్య కవిత్వానికీ, అందులోని గాఢమైన, హృద్యమైన పద వైచిత్రికీ, ఆలోచనకి, కావ్యానురక్తికి మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్న కవులు. ఆ ఆనందాన్ని ఆస్వాదించే క్రమంలో ఈ పురస్కారం ఒక చిన్న బహుమానం…
నవీన్ మిట్టల్. తెలంగాణలో సీనియర్ IAS అధికారి. గతంలో ఒకటి రెండు శాఖలకు సెక్రటరీగా పనిచేశారు. తెలంగాణ ఏర్పాటయ్యాక మున్సిపల్ శాఖ కార్యదర్శిగా ఉన్నారు కూడా. తర్వాత ఏమైందో ఏమో నవీన్ మిట్టల్ ప్రాధాన్యం తగ్గిపోయింది. డిమోషన్‌లోనే ఉండిపోయారు. సెక్రటేరియట్ నుంచి HODకి బదిలీ అయ్యారు. ప్రస్తుతం కళాశాల విద్య, సాంకేతిక విద్యాశాఖలకు కమిషనర్‌గా ఉన్నారు నవీన్ మిట్టల్. ఇది ఆయన స్థాయికి తగ్గ పోస్ట్ కాదన్నది అధికారవర్గాల వాదన. పైపెచ్చు ఆయన విధులు నిర్వహిస్తున్న శాఖకు…
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భారతీయ నటీనటుల సందడి ఇంతా అంతా కాదు! దీపికా పదుకునే, తమన్నా, పూజా హెగ్డే, ఊర్వశీ రౌతేలా వంటి అందాల భామలు ఇండియన్ పెవిలియన్ ప్రారంభోత్సవంలో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచారు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తాను తొలిసారి పాల్గొన్నానని చెప్పిన తమన్నా… ఆ అవకాశం తనకు కల్పించిన కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కు ధన్యవాదాలు తెలిపింది. ‘బాహుబలి’ సినిమాతో…
తెలుగు ఇండియన్ ఐడిల్ న్యాయనిర్ణేతల్లో నిత్యామీనన్ 23వ ఎపిసోడ్ లో మిస్ అయ్యింది. ఆమెకు బదులుగా ప్రముఖ సినీ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి పాల్గొని, కంటెస్టెంట్స్ కు మార్కులు వేశారు. విశేషం ఏమంటే… మేల్ ఎనర్జీని బాలెన్స్ చేస్తూ, ఈ వారం శ్రీరామచంద్రతో కలిసి ప్రముఖ నేపథ్య గాయని శ్రావణ భార్గవి హోస్ట్ చేసింది. రామజోగయ్య శాస్త్రి హాజరు కావడంతో వీకెండ్ ఎపిసోడ్స్ ను ఆయన స్పెషల్ గా ప్లాన్ చేశారు. వైష్ణవి ప్రారంభ గీతంగా…