తెలుగు ఇండియన్ ఐడల్ చివరి దశకు చేరింది. 15 వారాల పాటు సాగిన ఈ సంగీత ప్రయాణం చివరి ఘట్టానికి చేరుకుంది. ఈ నెల 17న తెలుగు ఇండియన్ ఐడల్ తొలి విజేత ఎవరో తెలియనుంది. ఫైనలిస్ట్ లుగా నిలిచిన ఐదుగురిలో విజేత ఎవరన్నది మెగాస్టార్ చిరంజీవి ప్రకటించనున్నారు.
ఈ ఫైనల్ ఎపిసోడ్ చిత్రీకరణలో పాల్గొని గాయనీ గాయకులను ఉత్తేజపరుస్తూ వారు పాడిన పాటలకు స్టెప్స్ వేసి మరీ పులకింపచేశారు చిరంజీవి. గాయని ప్రణతి వాళ్ళ మదర్ తో కలిసి ‘సందెపొద్దుల కాడ’ పాట పాడటంతో పాటు స్టెప్ కూడా వేశారట. ఆయన వారిరువురి పాటకి స్టస్టస్ వేసి, ప్రణతి యొకక ఆటోప్గాఫ్ తీసుకున్నారు. శ్రీనివాస్, జయంత్ పాటలకి స్టెప్స్ వేయటమే కాదు వారికి బహుమతులు కూడా అందచేశారు. చిరుతో పాటు జడ్జెస్ పెర్ఫార్మెన్స్, కంటెస్టంట్స్ పాటలతో పాటు రానా, సాయిపల్లవి ప్రత్యేక అతిథులుగా పాల్గొని పోటీదారులను ఉత్తేజపరిచారు. వచ్చే శుక్రవారం రాత్రి 9 గంటలకు తెలుగు ఇండియన్ ఐడల్ వీక్షించి విజేత ఎవరో తెలుకోండి.