యూపీలోని గోండాలో గురువారం మధ్యాహ్నం ఘోర రైలు ప్రమాదం జరిగింది. చండీగఢ్ నుంచి గోరఖ్‌పూర్ మీదుగా అస్సాం వెళ్తున్న దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 10 కోచ్‌లు పట్టాలు తప్పాయి.
అశ్వారావుపేట మండలం నారాయణపురం కట్ట మైసమ్మ ఆలయ సమీపంలో15మంది కూలీలు వరదలో చిక్కుకున్నారు. ఎటువంటి సమాచారం లేకుండా పెదవాగు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తటంతో వరదలో చిక్కుకొని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.
సైబర్ నేరగాళ్లు రైతులను కూడా వదలడం లేదు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు సైబర్ నేరస్థులు ఏదో బ్యాంకు పేరిట వాట్సాప్ ప్రొఫైల్ బ్యాంకు పేరు మరియు పిక్చర్ బ్యాంకు లోగోతో ఏపీకే ఫైల్స్ (APK files) పంపుతున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. చండీగఢ్ నుంచి దిబ్రూగఢ్‌కు వెళ్తున్న దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ (15904) ఉత్తరప్రదేశ్‌లోని గోండాలోని జిలాహి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది.
బంగ్లాదేశ్‌లో గత కొన్ని రోజులుగా ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని మార్చాలంటూ గత కొన్ని రోజులుగా యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు.
మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మూడేళ్లలో 80 మంది మావోయిస్టుల హతమయ్యారు. 2021 నుంచి ఇప్పటి వరకు 80 మంది మావోయిస్టులను పోలీసులు మట్టుబెట్టారు. 102 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు.
జైష్-ఎ-మహ్మద్ (JeM) చీఫ్ మసూద్ అజార్ పాకిస్థాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. చనిపోయాడు లేదా విగత జీవిగా మారాడని గతంలో పలు మీడియా సంస్థలు అభివర్ణించాయి.
అందరికీ ఏదో ఒక సమయంలో చర్మ సమస్యలు వస్తాయి. అయితే, వర్షాకాలంలో చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. ఎందుకంటే ఈ సీజన్‌లో తేమ కారణంగా.. బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది.
ప్రైవేటు రంగంలోని సీ, డీ కేటగిరీ ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయాన్ని కర్ణాటక ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. కర్ణాటక ప్రభుత్వం ఈ బిల్లును పునఃపరిశీలించనుంది.
హ్యుందాయ్ మోటార్ త్వరలో భారతీయ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానుంది. కంపెనీ తన ఐపీవో (Hyundai IPO) కోసం సెబీ(SEBI)కి పత్రాలను కూడా పంపింది. తాజాగా ఈ కంపెనీ మహారాష్ట్రలోని నాగ్‌పూర్ మరియు ఔరంగాబాద్‌లో మొబైల్ మెడికల్ యూనిట్‌ను ప్రారంభించింది.