ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. చండీగఢ్ నుంచి దిబ్రూగఢ్‌కు వెళ్తున్న దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ (15904) ఉత్తరప్రదేశ్‌లోని గోండాలోని జిలాహి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. 10 నుంచి 12 కోచ్‌లు పట్టాలు తప్పినట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. ఈ రైలు చండీగఢ్ నుంచి దిబ్రూగఢ్‌కు వెళ్తోంది ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారనే విషయమై రైల్వేశాఖ, అధికారులు ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహాయక సామగ్రితో ఘటనాస్థలికి చేరుకోవాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. అయితే రైలు ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు.
READ MORE: Kakani Govardhan Reddy: వైసీపీ నేతల మీద దాడులు పెరిగిపోతున్నాయి.. పోలీసులు ఎక్కడ..?
ప్రయాణికులు భయంతో ఒక్కసారిగా కేకలు వేశారు. బయటకు పరుగులు తీశారు. గోండా నుంచి ఎమర్జెన్సీ రెస్క్యూ టీమ్‌లు సహాయం కోసం స్థలానికి చేరుకున్నాయి.