పారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఈ టోర్నీపై అభిమానుల్లో రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. జులై 26 నుంచి ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయి.
మధ్యప్రదేశ్‌లోని హృదయవిదారకర ఘటన చోటుచేసుకుంది. ఆస్తికోసం తన తల్లిని మట్టుబెట్టాడు ఓ కిరాతక కుమారుడు. రాష్ట్రంలోని భింద్‌లో 95 ఏళ్ల వృద్ధ తల్లిని ఆమె కొడుకు.. భార్య, మనవడితో కలిసి హత్య చేశాడు.
హింసాత్మక నిరసనల మధ్య ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా విధానాన్ని కొనసాగించాలన్న హైకోర్టు నిర్ణయాన్ని బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఆదివారం రద్దు చేసింది. అయితే..సుప్రీం కోర్టు ఈ రిజర్వేషన్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయలేదు.
దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ సంవత్సరం 40 వేల మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకోనున్నట్లు వెల్లడించింది.
రాజస్థాన్‌లోని షాపురా జిల్లాలో ఓ విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త మృతితో షాక్‌కు గురైన భార్య, కుమారుడు కూడా మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
భారత్-పాక్ సరిహద్దుల్లో పాకిస్థాన్‌కు చెందిన మరోదుశ్చర్య ఆలస్యంగా వెలుగు చూసింది. పాకిస్థాన్ పౌరులు సరిహద్దులోని 25 మీటర్ల పొడవైన ఫెన్సింగ్ ను కత్తిరించి దాన్ని తీసుకువెళ్లారు.
బంగ్లాదేశ్ హింసాకాండ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ భారీ ప్రకటన చేశారు. ఆదివారం కోల్‌కతాలో అమరవీరుల దినోత్సవ ర్యాలీ సందర్భంగా విక్టోరియా హౌస్ ముందు ఏర్పాటు చేసిన సమావేశంలో మమతా బెనర్జీ బంగ్లాదేశ్ ప్రజలకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ఏడో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. జులై 22 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది బడ్జెట్ను ప్రవేశపెట్టడంతో వరుసగా ఏడు బడ్జెట్లను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా సీతారామన్ రికార్డులకెక్కనున్నారు.
బ్రిటన్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం నుంచి ఛత్రపతి శివాజీ ' వాఘ్ నఖ్' (ఆయుధం)న్ని మహారాష్ట్రకు తీసుకొచ్చారు. ఇప్పుడు దీనిని మహారాష్ట్ర సతారాలోని ఛత్రపతి శివాజీ మ్యూజియంలో ప్రదర్శన కోసం ఉంచారు.