TCS Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..టీసీఎస్ లో భారీగా ఉద్యోగాలు
- నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్
- ఈ సంవత్సరం 40 వేల మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకోనున్నట్లు వెల్లడి
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఉద్యోగ అవకాశాలపై ఎక్కువగా ఉండదని ప్రకటన
- మొదటి త్రైమాసికంలో 5452 మంది ఉద్యోగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ సంవత్సరం 40 వేల మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకోనున్నట్లు వెల్లడించింది. అంతేకాదు ప్రస్తుతం ప్రపంచమంతా ఉద్యోగులను వణికిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఉద్యోగ అవకాశాలపై ఎక్కువగా ఉండదని ఇటీవల కంపెనీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 5452 మంది ఉద్యోగులను కూడా నియమించినట్లు ప్రకటించింది. దీంతో కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,06,998కి పెరిగినట్లు టీసీఎస్ యాజమాన్యం పేర్కొంది. దీంతోపాటు ఉద్యోగుల వేతనాలను కూడా సవరించింది. ప్రస్తుతం ఉన్న వేతనాలను 4.5 శాతం నుంచి 12 శాతానికి పెంచింది. అలాగే ప్రతి 5 రోజులకోసారి కార్యాలయానికి వచ్చే ఉద్యోగుల సంఖ్య కూడా 70 శాతానికి పెరిగినట్లు టిసిఎస్ పేర్కొంది.
READ MORE: Haryana: బ్రజ్ మండల్ యాత్ర.. నుహ్‌లో ఇంటర్నెట్ బంద్..
Also Read
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
- IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
ప్రీ-కోవిడ్ స్థాయికి చేరుకుంటున్న ఆఫీసులో ఉద్యోగుల హాజరు..
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కార్యాలయాల నుంచి పనిచేసే ఉద్యోగుల శాతం కోవిడ్ మహమ్మారి కంటే ముందు స్థాయికి చేరుకున్నట్లు టాటా గ్రూప్ కంపెనీ హ్యూమన్ రిసోర్స్ విభాగం అధిపతి మిలింద్ లక్కడ్ తెలిపారు. 18 నెలల కృషి అనంతరం ఈ స్థాయిని సాధించగలిగామని వెల్లడించారు. నిజానికి కోవిడ్‌కు ముందు ఉన్న ఉద్యోగుల హాజరు స్థాయికి దాదాపుగా తిరిగి వస్తున్నామని చెప్పారు. ఆరు లక్షల మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉన్న కంపెనీలో 70 శాతం కంటే ఎక్కువ మంది ఆఫీసుకు హాజరవుతున్నారని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!