హిమాయత్ నగర్ దోపిడీ కేసును తెలంగాణ పోలీసులు ఛేదించారు. తక్కువ సమయంలో కేసును ఛేదించి శభాష్ అనిపించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దోపిడీ జరిగిన వెంటనే అన్ని డిపార్ట్మెంట్స్ అప్రమత్తమయ్యి నిందితులను పట్టుకోవడం జరిగిందని తెలిపారు.. మూడు కోట్ల రూపాయల సొత్తు దొంగిలించారని.. సొత్తు విలువ బహిరంగ మార్కెట్ విలువ అయిదు కోట్లు పైనే ఉంటుందన్నారు.. 11 తేదీన రోహిత్ కేడియా కూతురు వివాహం కోసం దుబాయ్ వెళ్లారని.. వీరి కుటుంబం ఆయిల్ బిజినెస్ చేస్తుంటారన్నారు.. ఉదయం వీరు కూతురు పెళ్ళికి దుబాయ్ వెళ్లారని చెప్పారు.. మొలహు ముఖ్య , సుశీల్ ముఖ్య , బసంతిలు ఈ చోరీ చేసినట్లు తెలిపారు. నిందితులు గతంలో మర్డర్ కేసులో ఉన్నట్లు వెల్లడించారు.. స్నేహలత అనే మహిళను హత్య చేసిన కేసులో కోటీ రూపాయలు దోచుకున్నట్లు తెలిపారు..
READ MORE: Himanta Sarma: కాంగ్రెస్ ఎంపీ భార్యకు ‘‘పాకిస్తాన్’’ లింక్.. సీఎం సంచలన ఆరోపణలు..
మర్డర్ కేస్ నిందితులు ములుహు ముఖ్య, సుశీల్ ముఖ్యలు పరారీలో ఉన్నారని.. వీరు బీహార్ కు చెందిన వారన్నారు.. నమ్మకంగా కేడియా ఇంట్లో నమ్మకంగా పని చేస్తున్నట్టు నటించినట్లు వివరిచారు.. కేడియా కుటుంబం దుబాయ్ వెళ్ళగానే సొత్తు మొత్తం దోచుకుని వెళ్లారని.. సీసీ ఫుటేజ్ ల ద్వారా ట్రాక్ చేస్తే సికిందరాబాద్ నుంచి తెలంగాణ ట్రైన్ ద్వారా వెళ్లి నట్లు చెప్పారు. భూపాల్, నాగ్ పూర్, పాట్న ప్రాంతాల్లో టీమ్స్ పంపామని.. నిందితులు నాగ్ పూర్ వెళ్లే సరికి మా టీమ్స్ అక్కడ చెక్ చేసి 11 వ తేదీ సాయంత్రం పట్టుకున్నట్లు వెల్లడించారు. ఆ సమయంలో వారు దొంగిలించిన సొమ్ము అంతా వారితోనే ఉందని సీపీ ఆనంద్ తెలిపారు.. అయిదు కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకుని, నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరు దోచుకున్న సొమ్ములో నగలు, డైమాండ్స్, గోల్డ్ కాయిన్స్, ఇండియన్ కరెన్సీ, ఫారెన్ కరెన్సీ ఉందన్నారు..
READ MORE: Chilkur Balaji Temple Priest: అర్చకుడు రంగరాజన్‌పై దాడి కేసు.. మరో ఏడుగురి అరెస్ట్