KCR: మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. ఈ నెల 19న…
- బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం
- సమావేశానికి హాజరుకానున్న కేసీఆర్
- హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 19 వ తేదీన బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కె.టి.రామారావును ఆదేశించారు. అధినేత ఆదేశాలమేరకు.. ఈనెల 19వ తేదీన మధ్యాహ్నం1 గంట నుంచి హైద్రాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో పార్టీ విస్త్రృత స్థాయి సమావేశం జరగనుంది. అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత, మాజీ, ఎంపీలు, శాసనమండలి సభ్యులు, శాసన సభ్యులు, కార్పోరేషన్ ఛైర్మన్లు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు.. పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు హాజరవుతారు.
READ MORE: Bihar: మద్యానికి బానిసైన భర్త.. లోన్ రికవరీ ఏజెంట్‌ని పెళ్లి చేసుకున్న భార్య..
Also Read
- Car Sales in August: పెట్రోల్ కార్ల వాటా రికార్డు స్థాయిలో పతనం.. భారత మార్కెట్లో కొత్త ట్రెండ్
- స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
- 990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
- AP Crime: ఏపీలో బంగ్లా విద్యార్థినిపై అత్యాచారయత్నం.. తప్పించుకునే క్రమంలో నిందితుడు మృతి
ఈ ప్రత్యేక సమావేశంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక అంశాలపై విస్తృతస్థాయిలో చర్చించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలమీద ప్రధానంగా చర్చ జరగనుంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు అనుగుణంగా పార్టీ శ్రేణులు చేపట్టవలసిన కార్యాచరణపై సమగ్ర చర్చ జరగనుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను సాధించుకుంటూ, తమ హక్కులను తాము కాపాడుకునే దిశగా రాష్ట్ర ప్రజలను చైతన్యం చేసేందుకు పార్టీ నాయకత్వం అనుసరించాల్సిన వ్యూహాలు విధానాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సమగ్ర చర్చ జరిపి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే కీలక సమావేశం కాబట్టి ఆహ్వానితులందరూ రావాలని కేటీఆర్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Igho Ubiribo: ప్రైవేట్ పార్ట్ పరిమాణం పెంచే కాస్మెటిక్ ప్రక్రియ చివరకు ఈ ఇన్ఫ్లుయెన్సర్ ప్రాణాన్ని ఎలా తీసింది?
-
2026 Tollywood : ఫేడౌట్ హీరోలకు కలిసివచ్చిన 2026.. వరుస ప్లాపుల తర్వాత దక్కిన ఊరట!
-
Mercedes-AMG Petronas e-Bike: 100KM రేంజ్.. 9 గేర్లు.. Mercedes కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ లాంచ్, ధర చూస్తే షాక్!
-
Epic: తమ్ముడి కోసం రంగంలోకి విజయ్ దేవరకొండ.. ‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రౌడీ హీరో?
-
Car Sales in August: పెట్రోల్ కార్ల వాటా రికార్డు స్థాయిలో పతనం.. భారత మార్కెట్లో కొత్త ట్రెండ్
ట్రెండింగ్
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!