రాష్ట్రపతి భవన్.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలో అత్యున్నత కార్యక్రమాలు నిర్వహించే ప్రత్యేక స్థలం ఇది. ప్రధాని ప్రమాణ స్వీకారం, విదేశీ దేశాధినేతల సమావేశాలు, గౌరవ విందులు లాంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. కాగా నేడు (బుధవారం 12 ఫిబ్రవరి).. రాష్ట్రపతి భవన్ భద్రత విభాగంలో పీఎస్ఓ (Personal Security Officer) హోదాలో పని చేస్తున్న పూనమ్ గుప్తా వివాహం ఇక్కడ ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేకంగా ఈ అవకాశం కల్పించారు.
READ MORE: CM Chandrababu: బడ్జెట్ కూర్పుపై ప్రభుత్వం కసరత్తు.. సీఎం సమీక్ష
ఇదిలా ఉండగా.. ఇది రాష్ట్రపతి భవన్‌లో జరిగిన మొదటి పెళ్లి అని వార్తలు వెలువడ్డాయి. కానీ.. ఇది వాస్తవం కాదు.. చరిత్రలో తొలిసారిగా రాష్ట్రపతి భవన్ వివాహానికి ఆతిథ్యం ఇస్తున్నట్లు వచ్చిన వార్తలను పీఐబీ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) తోసిపుచ్చింది. పీఐబీ అనేది ప్రభుత్వానికి చెందిన నోడల్ ఏజెన్సీ. రాష్ట్రపతి భవన్ ప్రారంభం నుంచి అనేక వివాహాలు జరిగాయని పీఐబీ తెలిపింది. కానీ.. రాష్ట్ర పతి భవన్‌లో ఎప్పుడు ఎవరి వివాహాలు జరిగాయన్న సమాచారం అందించలేదు.
READ MORE: Amartya Sen: కాంగ్రెస్-ఆప్ ఐక్యత చాలా అవసరం, కలిసి పోరాడాల్సింది..
ఇదిలా ఉండగా.. రాష్ట్రపతి భవన్‌లో పెళ్లి పీటలెక్కిన పూనమ్‌గుప్తా.. 74వ గణతంత్ర దినోత్సవ కవాతులో మహిళా బృందానికి నాయకత్వం వహించారు. ఆమెకు కాబోయే భర్త అవనీష్ కుమార్ ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. పూనమ్ గుప్తా విధి నిర్వహణలో చూపిన అంకితభావాన్ని గుర్తించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లో వారి వివాహానికి అనుమతినిచ్చారు. సీఆర్‌పీఎఫ్ అధికారిణి పూనమ్ గుప్తా మధ్యప్రదేశ్ నివాసి. గణితంలో గ్రాడ్యుయేషన్ చేశారు. అనంతరం ఆంగ్ల సాహిత్యంలో పీజీ చేశారు. బీఈడీ కూడా పూర్తి చేశారు. 2018లో ఆమె యూపీఎస్‌సీ సీఆర్‌పీఎఫ్ పరీక్షలో 81వ ర్యాంకు సాధించారు. బీహార్‌లోని నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో పూనమ్ గుప్తా ప్రశంసనీయమైన సేవలు అందించారు.
It is being claimed in news reports that for the first time in history, Rashtrapati Bhavan will be hosting a wedding. #PIBFactCheck
▶️This claim is Fake
▶️President's Estate has been the venue of several weddings since its inception. pic.twitter.com/nE4ZJ5CYMo
— PIB Fact Check (@PIBFactCheck) February 12, 2025