భద్రతను దృష్టిలో ఉంచుకుని భారతదేశం 2020లో కొన్ని చైనీస్ యాప్‌లను నిషేధించింది. అయితే.. ప్రస్తతం మళ్లీ ఈ యాప్స్ తిరిగి భారత్‌లోకి వచ్చాయి. 36 యాప్‌లు లను తిరిగి జాబితా చేరాయి. UC బ్రౌజర్, షీన్, టిక్‌టాక్‌తో సహా 200 కి పైగా చైనీస్ యాప్‌లను నిషేధించింది. భారతీయ వినియోగదారుల గోప్యత, భద్రతకు హాని కలిగించే ప్రమాదాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ యాప్‌లను నిషేధించారు. అయితే, ఐదు సంవత్సరాల తర్వాత వీటిలో 36 యాప్‌లు రహస్యంగా భారతదేశానికి తిరిగి వచ్చాయి.ఈ జాబితాలో షాపింగ్ నుంచి ఫైల్ షేరింగ్, గేమింగ్ యాప్‌ల వరకు ఉన్నాయి.
READ MORE: Its Complicated: ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ అందుకే రీ రిలీజ్: సిద్ధు జొన్నలగడ్డ
గతంలో నిషేధించిన యాప్‌ల బ్రాండింగ్, యాజమాన్యంలో మార్పులు చేశారు. ఈ యాప్‌లు ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ లలో ఉన్నాయి. ప్రముఖ షాపింగ్ ప్లాట్‌ఫామ్ షీన్-టావోబావోతో పాటు, ఫైల్ షేరింగ్ యాప్ జెండర్, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ మ్యాంగోటీవీ, డేటింగ్ యాప్ టాంటాన్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇటీవల వెలువడిన నివేదికల ప్రకారం.. ఈ యాప్‌లలో కొన్నింటిని ఇప్పటికీ చైనీస్ డెవలపర్లు నిర్వహిస్తున్నారు. మరికొన్ని భారతీయ మార్కెట్‌లోకి తిరిగి రావడానికి చిన్న మార్పులు చేసుకున్నాయి. భారత్ మార్కెట్లో ప్రవేశించడానికి ప్రముఖ షాపింగ్ యాప్ షెయిన్ రిలయన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఇది ‘షీన్ ఇండియా ఫాస్ట్ ఫ్యాషన్’ పేరుతో మార్కెట్లో ఉంది. షీన్ వినియోగదారులందరి డేటా భారతీయ సర్వర్లలో మాత్రమే నిల్వ చేస్తుందని ప్రభుత్వం పూర్తి హామీ ఇచ్చింది. ఇప్పుడు ఈ యాప్‌కు చైనీస్ మాతృ సంస్థతో ఎలాంటి సంబంధం ఉండదు.