ఈ రోజు పార్లమెంట్ లో తీవ్ర గందరగోళం నెలకొంది. పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు వక్ఫ్ చట్టం 1995ని సవరించడానికి వక్ఫ్ (సవరణ) బిల్లు 2024ను ప్రవేశపెట్టారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి పాకిస్థాన్ నుంచి మామిడి పండ్లను పంపిందన్న వార్తలపై భారతీయ జనతా పార్టీ మండిపడుతోంది. ఇది పాకిస్థాన్‌తో 'నీచమైన' సంబంధమని బీజేపీ అభివర్ణించింది.
దేశం ప్రస్తుతం ఇంత ప్రశాంతంగా ఉందంటే.. సరిహద్దుల్లోని భద్రతా దళం యొక్క త్యాగం ఎనలేనిది. వారు అక్కడ రాత్రింబవళ్లు కాపుకాస్తూ..ప్రాణాలు సైతం పణంగా పెడుతున్నారు..కాబట్టే మనం స్వేచ్ఛావాయువును పీలుస్తున్నాం.
నాగ పంచమి నాడు నాగ దేవతను ఆరాధించడం వలన ఆర్థిక శ్రేయస్సు పెరుగుతుందని హిందువులు భావిస్తుంటారు. నాగదేవతను శివాభరణంగా కొలుస్తారు. నాగ పంచమి రోజు నాగదేవతలను ఆరాధించడం వలన జీవితంలో.. సంతోషంతో పాటు కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ప్రస్తుతానికి భారత్‌లోనే ఉంటారని షేక్ హసీనా కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ చెప్పారు. ఇప్పట్లో ఇక్కడి నుంచి వెళ్లే ఆలోచన లేదని తేల్చిచెప్పారు.
కోవిడ్ -19 వ్యాధి నుంచి కోలుకున్న వ్యక్తులపై భారతదేశం, విదేశాలలో నిర్వహించిన అధ్యయనాలలో కొన్ని సాధారణ అంశాలు వెలువడ్డాయి. ఆసుపత్రిలో చేరినా.. ఆసుపత్రిలో చేరకుండానే కోలుకుంటున్న, మిశ్రమ పద్ధతుల ద్వారా కోలుకున్న రోగులలో అలసట అనేది చాలా తరచుగా వస్తుందట.
అమెజాన్ లో మ్యాక్‌బుక్‌పై బంపర్ ఆఫర్ నడుస్తోంది. ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ ఎమ్1పై ప్రస్తుతం ఆకర్షణీయమైన ఆఫర్ అందుబాటులో ఉంది. వాస్తవానికి.. అమెజాన్ లో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ జరుగుతోంది.
ఒలింపిక్స్ 2024లో భారత రెజ్లింగ్‌కు కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. వినేష్ ఫోగట్ అనర్హత తర్వాత.. ఒలింపిక్ విలేజ్‌కు భారత రెజ్లర్ యాంటిమ్ పంఘల్ అక్రిడిటేషన్ రద్దు చేయబడింది.
పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు ముందు అనర్హులుగా ప్రకటించబడిన భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. గురువారం ఉదయం ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా తెలిపారు.
ఎగువున కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా బేసిన్లో ఎగువున ఉన్న ప్రాజెక్టులు గరిష్ట నీటి మట్టానికి చేరుకున్నాయి. దిగువ ప్రాజెక్టుల వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. కొన్నేళ్లుగా నీటి కొరతను ఎదుర్కొన్న ఏపీలో ఇప్పుడు కృష్ణమ్మ ఉగ్రరూపం భయపెడుతోంది.