Parliament: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ప్రవేశ పెట్టిన కేంద్రం..లోక్‌సభలో తీవ్ర గందరగోళం
- ఈ రోజు పార్లమెంట్ లో తీవ్ర గందరగోళం
- లోక్ సభలో వక్ఫ్ చట్టం 1995ని సవరించడానికి వక్ఫ్ (సవరణ) బిల్లు
- ఈ బిల్లును వ్యతిరేకిస్తూ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్న విపక్ష ఎంపీలు
- మతంలో జోక్యం చేసుకోవడమేనన్న స్పీ ఎంపీ మొహిబుల్లా
- సభ 2 గంటలకు వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ రోజు పార్లమెంట్ లో తీవ్ర గందరగోళం నెలకొంది. పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు వక్ఫ్ చట్టం 1995ని సవరించడానికి వక్ఫ్ (సవరణ) బిల్లు 2024ను ప్రవేశపెట్టారు. కాంగ్రెస్, ఎస్పీ ఎంపీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఇది మన మతంలో జోక్యం చేసుకోవడమేనని ఎస్పీ ఎంపీ మొహిబుల్లా అన్నారు. దీంతో పార్లమెంట్ లో తీవ్ర గందరగోళం నెలకొంది.
READ MORE: Andhra Pradesh: పల్నాడు జిల్లాలో వైసీపీ కార్యకర్త ఒంటేరు నాగరాజు కిడ్నాప్!
Also Read
- INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
- IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
వక్ఫ్ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదు – లాలన్ సింగ్
పార్లమెంట్‌లో వక్ఫ్ బిల్లుకు కేంద్ర మంత్రి లాలన్ సింగ్ మద్దతు తెలిపారు. ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని లాలన్ సింగ్ విపక్షాలపై ధీమా వ్యక్తం చేశారు. “ఏదైనా సంస్థ నిరంకుశంగా మారినప్పుడు.. దానిని నియంత్రించడానికి, పారదర్శకత కోసం ప్రభుత్వం చట్టాలను చేస్తుంది. వక్ఫ్ బోర్డులో పారదర్శకత ఉండాలి. పారదర్శకత కోసమే ఈ బిల్లును తీసుకువచ్చాం.” అని స్పష్టం చేశారు.
READ MORE:Naga Chaitanya Engagement: ఇట్స్ అఫీషియల్.. శోభితతో నాగచైతన్య ఎంగేజ్‌మెంట్! నాగార్జున ట్వీట్ వైరల్
ఇది రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘన – కనిమొళి
ఇది రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమేనని డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి అన్నారు. “ఏ ఆలయ కమిటీలో హిందువేతర సభ్యుడు లేనప్పుడు వక్ఫ్‌లో ఎందుకు? ఈ బిల్లు ప్రత్యేకంగా సమానత్వం యొక్క చట్టాన్ని ఉల్లంఘించే మత సమూహాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఈ బిల్లు పూర్తిగా ముస్లింలకు వ్యతిరేకం. ఈ దేశం వివిధ మతాలు, వివిధ భాషల ప్రజలు నివసించే లౌకిక దేశం.” అని పేర్కొన్నారు.
READ MORE:Naga Chaitanya Engagement: ఇట్స్ అఫీషియల్.. శోభితతో నాగచైతన్య ఎంగేజ్‌మెంట్! నాగార్జున ట్వీట్ వైరల్
వక్ఫ్ బిల్లు ప్రాథమిక హక్కులపై దాడి – వేణుగోపాల్
వక్ఫ్ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. రాజ్యాంగం ప్రసాదించిన మత స్వేచ్ఛ హక్కును ఉల్లంఘించడమేనని అన్నారు. “ఈ బిల్లు ప్రాథమిక హక్కులపై దాడి. అయోధ్యలోని ఆలయంలో హిందువేతరు ఎవరైనా ఉన్నారా? ఏ దేవాలయం కమిటీలో హిందువేతరునైనా ఉంచారా? అని ఆయన ప్రశ్నించారు. వక్ఫ్ కూడా మతపరమైన సంస్థేనని వేణుగోపాల్ అన్నారు. ఇది సమాజాన్ని విభజించే ప్రయత్నంలో భాగంగా జరుగుతోందని మండిపడ్డారు.
READ MORE:Pune : పుణెలో ఘోర ప్రమాదం.. ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలో గ్యాస్ లీక్
రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా..
రాజ్యసభ కార్యకలాపాలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత సభా కార్యక్రమాలను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ ప్రకటించారు.
తాజావార్తలు
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు